Begin typing your search above and press return to search.

చంద్రబాబు ని కూడా పవన్ టార్గెట్ చేశారా...ఆ విషయంలో...?

By:  Tupaki Desk   |   22 Jun 2023 10:00 PM GMT
చంద్రబాబు ని కూడా పవన్ టార్గెట్ చేశారా...ఆ విషయంలో...?
X
ఏపీ లో రెండే కులాలు అంటూ పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్న వైసీపీ తో పాటు టీడీపీ కి కూడా గట్టిగా తగిలేట్టుగా ఉంది అంటున్నారు. ఇప్పటిదాకా నాన్ స్టాప్ గా వైసీపీ మీద జగన్ మీద డైరెక్ట్ గా విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ ఇపుడు రాజ్యాధికారం లో వాటా అంటూ కొత్తగా మాట్లాడారు.

ఆ రెండు కులాలు అంటూ ఆయన టార్గెట్ చేశారు. ఉమ్మడి ఏపీ అయినా విభజన ఏపీ అయినా రెండే కులాలు ఇప్పటిదాకా రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ వచ్చాయి. దీని మీద తెలుగు దేశం వైసీపీల ను అంతా విమర్శిస్తూంటారు. ఫస్ట్ టైం పవన్ నోట ఆ రెండు కులాలు మాట రావడం అంటే బాబు ని కూడా పవన్ విడిచిపెట్టలేదా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఒకటిరెండు కుల్లాలే ఆర్ధిక వ్యవస్థను గుప్పిట పెట్టుకున్నాయని, అలా ఇక మీదట కుదిరే వ్యవహారం కాదని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపులు,మత్య్సకారులు, అగ్ని కుల క్షత్రియులు,బలిజలు,యాదవులు, బీసీలు పైకి రావాల ని ఆయన కోరుకున్నారు.

అంటే అధికారానికి దూరంగా ఉన్న కులాల ను అన్నింటికీ ఏకత్రాటి మీదకు రమ్మని పవన్ కళ్యాణ్ కోరుతున్నారన్న మాట. మనమంతా అనైక్యంగా ఉంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అధికారం లోకి వస్తుంది అని ఆయన చెప్పడం విశేషం. అన్ని కులాలు ఒక్కటి కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

అలగే కోనసీమ రైతాంగాన్ని దోచుకుని ద్వారపూడి కుటుంబం లాభం పొందుతోందని పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలుచేశారు. బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. వాటి సంగతి ఎలా ఉన్నా అన్ని కులాలు కలవాలి అన్న దాంట్లో కమ్మ రెడ్లను పక్కన పెట్టేశారు.

అలాగే అనైక్యంగా మనం ఉంటే వైసీపీ పవర్ లోకి వస్తుంది అని ఒక హెచ్చరిక జారీ చేశారు. ఒక విధంగా పవన్ నోట వైసీపీ అధికరం లోకి వస్తుంది అన్న మాట రావడం విశేషమే. అదే సమయంలో అనైక్యత కులాల మధ్య ఉందని చెబుతూనే రాజకీయ అనైక్యత విపక్షల మధ్య ఏపీ లో ఉందని ఆయన టీడీపీ ని ఉద్దేశించి మాట్లాడారా అన్న చర్చ కూడా వస్తోంది.

మొత్తానికి చూస్తే వైసీపీ మళ్ళీ పవర్ లోకి వస్తుంది, నేను ఓడినా ఫైట్ చేస్తాను అన్న పవన్ మాటల వెనక అర్ధం ఏంటో కానీ తెలుగుదేశాని కి పరోక్ష హెచ్చరిక సూచనలా అన్నది అర్ధం కావడం లేదు అంటున్నారు. అలాగే రెండు కులాలు అంటూ టార్గెట్ చేయడం కూడా పవన్ టీడీపీ కి గురి పెట్టారా అన్న చర్చ వస్తోంది. ఏది ఏమైనా పవన్ మాటలు తీసుకుంటే ఆయన రోజుకో రకంగా మాట్లాడుతున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది.