Begin typing your search above and press return to search.

కేసీఆర్ మోడీని అదే కోరారా..? ఏపీ వాసుల ఆశ్చర్యం..

By:  Tupaki Desk   |   5 Sep 2021 11:30 AM GMT
కేసీఆర్ మోడీని అదే కోరారా..? ఏపీ వాసుల ఆశ్చర్యం..
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రధాన మంత్రి మోడీని కలిశారు. ఓ వైపు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా టఫ్ ఫైట్ సాగుతుండగా కేసీఆర్ మోడీని కలవడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ మోడీతో ఏం మాట్లాడారోనన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిగా మారింది. మరోవైపు బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు మాత్రం ప్రభుత్వ కార్యకలాపాల కోసం మాత్రమే కేసీఆర్ ప్రధానిని కలిశారని అంటున్నారు. అయితే కేసీఆర్ మాత్రం విభజన చట్టం అమలు కావడం లేదని, దాని అమలుకు చర్యలు తీసుకోవాలని మోడీని కోరినట్లు తెలుస్తోంది. మరి మోడీ కేసీఆర్ డిమాండ్ కు అంగీకరిస్తారా..? ఇంతకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చట్టం అమలు కావడం లేదా..?

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. ఆ తరువాత వెంటనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఏపీలో 2014లో టీడీపీ పాలన ప్రారంభించింది. అప్పటి వరకు కేంద్రంలో యూపీఏ-2 సర్కార్ కొనసాగగా తెలంగాణ విభజనతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక్కడా అక్కడ కొత్త ప్రభుత్వాలు మొదలయ్యాయన్నమాట. ఇక విభజన చట్టం ప్రకారం పదేళ్లు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే రాజధాని. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు పంపకాలు జరుపుకోవాలి.

కానీ తెలంగాణ ప్రభుత్వం 110 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను విభజించడానికి ఒప్పుకోలేదు. అలాగే ఆస్తుల విషయంలోనూ తెలంగాణ మెలికలు పెట్టడంతో ఏపీ నాయకులు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత విభజన చట్టంపై అప్పట్లో వైసీపీ నాయకులు ఆందోళన నిర్వహించినా అటు టీడీపీ గానీ టీఆర్ఎస్ గానీ పట్టించుకోలేదు. దీంతో మొత్తంగా ఏపీ వాసులు ఆస్తుల పంపకాల విషయంలో చాలా నష్టపోయారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ ఉన్నా ఏపీ వాసులు వినియోగించుకోలేకపోయారు.

ఈ నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి తాము విభజన చట్టం వల్ల తీవ్రంగా నష్టపోయామని, దానిని అమలు చేయాలని విన్నవించారు. అయితే మోడీ అప్పటి కప్పుడు నవ్వుతూ సీఎం జగన్ ను పలకరించి తిరిగి పంపించారు. ఇలా వైసీపీ అధికారంలోకి వచ్చినా విభజన చట్టం గురించి పట్టించుకోలేదు. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని నిధులు అక్కడే ఆగిపోయాయాయి.

అంతేకాకుండా విభజనచట్టంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ లాంటి చాలా హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. దీంతో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి మోడీని ఈ విషయంపై అడిగినా స్పందనలేదు. అయితే పోలవరం లాంటి ప్రాజెక్టులతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి జగన్ మోడీ దగ్గర మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మోడీ విభజన చట్టం టాఫిక్ ను పక్కకు నెట్టేశారు.

ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల మోడీని కలిసి విభజన చట్టం అమలు చేయాలని కోరాడట. ఏడేళ్ల తరువాత విభజన చట్టం అమలు చేయాలని అడగడం హస్యాస్పదంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. వాస్తవానికి విభజన చట్టం వల్ల ఎక్కువగా నష్టపోయింది ఏపీనే. తెలంగాణ మిగులు నిధులతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన ప్రారంభించుకుంది. ఏపీ నష్టానికి కేంద్రం ఎంత కారణమో తెలంగాణ కూడా అంతే కారణమని ఏపీకి చెందిన మేధావులు అంటున్నారు. ఈ తరుణంలో తమకు నష్టం జరుగుతుందని కేసీఆర్ మోడీతో చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.