Begin typing your search above and press return to search.
ముందస్తు పైన జగన్ క్లారిటీ ఇచ్చేశారా...?
By: Tupaki Desk | 3 April 2023 2:50 PM GMTఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. దాంతో పాటు జగన్ ఈ మధ్య వరసబెట్టి ఢిల్లీ కి వెళ్లడాన్ని కూడా లెక్క వేసుకుని మరీ ఇంకేముంది ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయని ప్రచారం పెద్ద ఎత్తున మొదలైంది. దీని మీద వైసీపీ మంత్రులు ఒక వైపు ఖండిస్తున్నా ప్రచారం అయితే ఎక్కడా ఆగలేదు.
ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికల మీద ఎవరైతే క్లారిటీ ఇస్తే బాగుంటుందో ఆ అధినేత నోటి నుంచే ముందస్తు లేదు మరేదీ లేదూ అని పక్కా సమాచారం వచ్చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా ప్రెసిడెంట్లతో జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముందస్తు ఎన్నికలు అన్నది వట్టి ప్రచారం మాత్రమే అని కొట్టి పారేశారు.
ఇదంతా ఎల్లో మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారం అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలు భవిష్యత్తులు మరిన్ని వస్తాయని అప్రమత్తంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు అన్న ప్రశ్నే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వస్తాయని జగన్ పేర్కొన్నారు అంటే 2024 మేలోనే ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలియచేశారన్న మాట.
దాంతో ముందస్తు మీద ఫుల్ స్టాప్ పడుతుందా అన్నదే చూడాలి. అయితే జగన్ ఎమ్మెల్యేల తో ముందస్తు ఉండదు అంటే ఏడాది వ్యవధిలోనే ఎన్నికలు రాబోతున్నాయని జగన్ చెప్పినట్లుగా మరో వైపు ఎల్లో మీడియాలో ప్రచారం కావడం విశేషం. దీని మీద వైసీపీలోనే గందరగోళం నెలకొంది. అయిఏ జగన్ చెప్పినది ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉందని, అందువల్ల ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అన్న మాట మాత్రమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నెలలో కచ్చితంగా ఇరవై రోజుల పాటు జనంలో ఉండాల్సిందే అని జగన్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లుగా చెబుతున్నారు ప్రజలలో ఎక్కువగా ఉండాలని ఎన్నికల ఏడాది కాబట్టి జనంతో కనెక్ట్ అయితేనే మంచి ఫలితాలు వస్తాయని జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు.
ఇంకో వైపు మంత్రి వర్గ విసరణ విషయంలో వస్తున్న రూమర్లకు సైతం జగన్ చెక్ పెట్టేశారని భోగట్టా. మంత్రి వర్గ విస్తరణ అన్న దాని మీద కూడా పుకార్లు వస్తునాయని వాటిని ఎవరూ నమ్మవద్దు అని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి ప్రచారాన్ని కూడా జగన్ అసహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఇలాంటి వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ ఎమ్మెయేలు నాయకులు తీసుకోవాలని ఆయన కోరారని అంటున్నారు.
అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు అన్నది అసలు ఉండదనే అంటున్నారు. అలాగే తొందరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఫలనా వారికి చాన్స్ అంటూ వస్తున్న వార్తలు కూడా వట్టివే అని తేలిపోయింది. జగన్ సమీక్షా సమావేశానికి ఒక రోజు ముందే ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముందస్తు ఎన్నికలు ఉండవని కుండబద్ధలు కొట్టారు. అలాగే మంత్రి వర్గంలో మార్పులు అన్నవి అసలు ఉండవని కూడా స్పష్టం చేశారు. ఇదే మంత్రివర్గంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. ఆ మాటను మరో సన్నిహిత నేత పేర్ని నాని కూడా చెప్పారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు ఓడిపోవడం పట్ల కూడా ఈ సమెక్షలో చర్చ సాగింది. పట్టభద్రుల ఎన్నికల్లో పరిమితమైన ఓటర్లే ఓటు చేస్తారని, పైగా వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం ఇతర పార్టీలతో పొత్తుతో దిగిందని ఆయన అన్నట్లుగా భోగట్టా. అదే విధంగా ఈ ఎన్నికల ఫలితాలు ఏ విధంగానూ ప్రమాణం కాదని, వైసీపీకి ఓటమి కాదు, విపక్షాలకు విజయం కాదని జగన్ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అని ఈ సమావేశంలో గటిగా చెప్పినట్లుగా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.