Begin typing your search above and press return to search.
ఎర్రకోట ముట్టడి ‘హీరో’ దీప్ సిద్దు!
By: Tupaki Desk | 27 Jan 2021 5:57 AM GMTగణతంత్ర దినోత్సవం వేళ.. దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోటను విజయవంతంగా ముట్టడి చేసిన వైనం సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం ఇప్పుడు పెను వివాదానికి తెర తీయటమే కాదు.. ముట్టడి వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎర్రకోట ముట్టడి వెనుక ప్రముఖ పంజాబీ నటుడు దీప్ సిద్ధు హస్తం ఉన్నట్లుగా చెబుతున్నారు.
షెడ్యూల్ ప్రకారం రైతులు పేర్కొన్న మార్గాల్లో కాకుండా వేరే మార్గంలో.. అందునా ఎర్రకోట వైపు తీసుకెళ్లటంలో అతని పాత్ర ఉందంటున్నారు సంయుక్త్ కిసాన్ మోర్చా నేతలు. సోమవారం రాత్రి రైతుల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని.. ఆయన కారణంగానే ఎర్రకోటను ఆందోళనకారులు ముట్టడించారంటున్నారు. దీప్ సిద్ధుతో తమకు సంబంధం లేదని.. ఆయన ఎందుకిలా చేశాడో అర్థం కావట్లేదని రైతు నేతలు అంటున్నారు. రైతుల ఆందోళనను నీరుకార్చేందుకే హింసకు పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు.
తనపై రైతు సంఘాల నుంచి విమర్శలు రావటంతో దీప్ సిద్దు స్పందించారు. ఎర్రకోట మీద నిషాన్ సాహిబ్ జెండాను మాత్రమే తాను ఎగురవేశానని.. త్రివర్ణ పతకాన్ని తొలగించలేదన్నారు. ఖాళీ పోస్టు మీద మాత్రమే జెండాను ఎగురవేశానని.. నిరసన వ్యక్తం చేయటం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కుఅని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని వీడియో సందేశంలో పేర్కొన్నాడు. దీంతో.. ఎర్రకోట ముట్టడి అతను కీలకంగావ్యవహరించినట్లు అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే.. దీప్ సిద్దుకు.. బీజేపీ అగ్రనాయకత్వానికి ఉన్న సంబంధాలు ఇప్పుడు బయటకువస్తున్నాయి. ప్రధాని మోడీతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రైతులకు చెడ్డపేరు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగానే ఇలాంటివి చేస్తున్నారంటున్నారు. ఇక.. దీప్ సిద్దూ విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు కమ్ గుర్దాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు.
సన్నీడియోల్ ఎన్నికల ప్రచారంలో ఆయనే కీలకభూమిక పోషించారని చెబుతారు. అయితే.. గత డిసెంబరు నుంచి దీప్ సిద్దుకు సన్నీడియోల్ దూరంగా ఉంటున్నారు. రైతు సంఘాలు సైతం అతన్ని దూరంగా ఉంచాయి. విపక్షాలు కావాలనే.. తమను టార్గెట్ చేసినట్లు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మోడీ.. అమిత్ షాలతో ఫోటోలు దిగినంత మాత్రాన తమను అనుమానించటం సరికాదంటున్నారు. సినీ నటులు ఎంతోమంది ఫోటోలు దిగుతారని.. వాటిని ఆధారంగా చూపించి విమర్శలు.. ఆరోపణలు చేస్తారా? అంటూ కమలనాథులు క్వశ్చన్ చేస్తున్నారు.