Begin typing your search above and press return to search.

అదానీ.. అప్పులతోనే ఎదిగారా?

By:  Tupaki Desk   |   23 Feb 2023 9:37 PM GMT
అదానీ.. అప్పులతోనే ఎదిగారా?
X
గౌతం అదానీ.. మొన్నటివరకూ ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడు. కానీ హిండెన్ బర్గ్ నివేదిక.. ఆ తర్వాత వికీపీడియా సమాచారంతో ఆయన సంపద కరిగిపోయింది. ఏకంగా 25వ స్థానం కిందకు పడిపోయాడు. షేర్ల ధరల్లో విన్యాసాలు, ఖాతా పుస్తకాల్లో మోసాలు తదితర అవకతవకల ద్వారా అదానీ గ్రూప్ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంబకోణానికి పాల్పడిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. ఈ వివాదంపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

అదానీ కంపెనీలు రూ.10 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ నివేదిక బయటపెట్టింది. దీనిపై చర్చ జరగాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.

అదానీ, మోదీ భాయి భాయి అని.. ఈ విషయంపై స్పందించాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వాలు కూలిపోయాయని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదని విమర్శించారు.

అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.19.40 లక్షల కోట్ల నుంచి రూ.15.30 లక్షల కోట్లకు పడిపోయింది. ఇప్పుడు ఇంకా పడిపోయింది. శాతం పరంగా కోత 25 శాతం. అదానీ గ్రూప్ ఏసీసీ మరియు అంబుజా సిమెంట్స్‌తో సహా 9 లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉంది. ఈ ఒక్కో స్టాక్‌లో సగటు పతనం 20 శాతం. ఎఫ్ అండ్ ఓ విభాగంలో నాలుగు కంపెనీలు ఉన్నాయి. ఆరు కంపెనీలు 20 శాతానికి పైగా పడిపోయాయి; రెండు కంపెనీలకు కేవలం 5 శాతం సర్క్యూట్ మాత్రమే ఉంది.

అదానీ ఎంటర్‌ప్రైసెస్, దీని ఎఫ్‌పిఓ బ్లాక్‌లో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్‌లో దాదాపు రూ.64,000 కోట్లు నష్టపోయాయి. అదానీ టోటల్ ఎం-క్యాప్‌లో రూ. 1 లక్ష కోట్లకు పైగా నష్టపోయింది.

అదానీ గ్రూప్ ఈక్విటీల ద్వారా కాకుండా అప్పుల ద్వారా పెట్టుబడుల సేకరణకు ప్రాధాన్యం ఇచ్చింది. పన్ను ఎగవేతదారులకు ఆశ్రయం ఇచ్చే విదేశాల్లో తమ మిత్రులు ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూపు నిధులు సమీకరించిందని హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపించింది. 25శాతం వాటాలను ప్రజలకు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ కేటాయించాలన్న నిబంధనను పాటించలేదని విమర్శలు వస్తున్నాయి. వివిధ విన్యాసాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన గ్రూపు షేర్లను పూచీకత్తుగా చూపి బ్యాంకులు ముదుపరి సంస్థల నుంచి అదానీ సంస్థలు భారీగా నిధులు సమీకరించారన్న ఆరోపణలున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.