Begin typing your search above and press return to search.
భారత్లో 150% పెరిగిన ఆ రోగులు!
By: Tupaki Desk | 7 Jun 2022 1:30 PM GMTమధుమేహం.. ఒకప్పుడు వయసు ప్రభావం తోనో లేక వంశపారం పర్యంగానో వచ్చే వ్యాధి. దాదాపు 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా సంక్రమించేది. కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు
ఒక్కసారి మధుమేహం వస్తే అది తొలగి పోవడం చాలా కష్టం. ఈ వ్యాధి మనిషి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. షుగర్ కంట్రోల్లో ఉండకపోతే.. పాదాలపై పుండ్లు ఏర్పడం, స్పర్శ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఒక్కసారి పాదాలపై డయాబెటిస్ ప్రభావం ప్రారంభమైతే.. వేల రూపాయలు ఖర్చు చేయటమే కాదు.. కొందరికి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక డయాబెటిస్ సోకిన వారికి చిన్న గాయమైనా.. మానటం కాస్త కష్టమేయ
ప్రస్తుత జీవన శైలితో చాలా మంది చిన్న తనంలోనే మధుమేహం బారిన పడుతున్నారు. ఏటికేడు ఈ వ్యాధి బారిన పడుతున్న సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో 3 దశాబ్దాలుగా డయాబెటిస్ రోగులు 150 శాతం పెరిగారని ఐసీఎంఆర్ తెలిపింది. వయోజనుల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులున్న రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందని వెల్లడించింది.
ఈ వ్యాధి బారిన పడినవారు నిత్యం వ్యాయామం చేయాలని, తినే ఆహారంలో 70 శాతం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలని.. సమయానికి భోజనం చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. బీపీ, బరువు, కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకుంటూ.. శారీరక ఎదుగుదలకు పోషకాహారం తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.
రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మందికి షుగర్ నిర్ధారణ పరీక్షలు చేస్తే సుమారు 13 లక్షల మందికి డయాబెటిస్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపింది.