Begin typing your search above and press return to search.
ఆ డీజీపీకి ఉన్నంత దమ్ము ఇంకెవరికీ ఉండదేమో?
By: Tupaki Desk | 5 Sep 2016 7:49 AM GMTఅత్యున్నత స్థాయిలో ఉండే అధికారులు కలలో కూడా ఊహించని సాహసాన్ని చేశారు ఉత్తరప్రదేశ్ డీజీపీ జావేధ్ అహ్మద్. కొత్తగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న ఒక తుపాకీని మొదట తన మీదనే ప్రయోగించాలని చెప్పి షాకిచ్చిన ఆయన.. చివరకు అన్నంత పని చేసి అందరిలోనూ విస్మయానికి గురి చేశారు. ఉగ్రవాదుల్ని హతమార్చకుండా వారికి షాకిచ్చేలా కాల్చేందుకు వీలుగా సరికొత్త తుపాకీల్ని సిద్ధం చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఈ టేజర్ గన్లను సిద్ధం చేసింది.
ఈ గన్లను కాల్చినప్పుడు.. పెద్ద షాక్ తగిలినట్లుగా టార్గెట్ లోని వ్యక్తి కిందపడిపోతారు. ఎలాంటి దెబ్బలు తగలనప్పటికీ.. షాక్ తగిలినట్లు పడిపోవటంతో వారిని ఈజీగా అదుపులోకి తీసుకునే వీలు ఉంటుంది. దాని శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలుసుకోవటానికి ఆయన తనపైనే ఆ తుపాకీని ప్రయోగించాలని అధికారుల్ని కోరారు. డీజీపీ స్థాయి అధికారి అలాంటి పని చేయమని ఆదేశిస్తే చేయగలరా? నీళ్లు నమిలిన అధికారులను ఒప్పించిన డీజీపీ టేజర్ తుపాకీ ప్రయోగానికి సిద్ధమయ్యారు.
అయితే.. గన్ కాల్చినప్పుడు డీజీపీ కింద పడిపోకుండా ఇద్దరు పోలీసు అధికారుల్ని ముందుగా సిద్ధం చేశారు. అనుకున్నట్లే ఆయనపై టేజర్ గన్ ను ప్రయోగించారు. వెంటనే.. ఆయన కిందపడిపోవటం.. ఆయన పడిపోకుండా పట్టుకున్న పోలీసుల్ని చూస్తూ.. చుక్కలు కనిపించాయ్ అంటూ నవ్వేశారు. ఆయన ధైర్యసాహసాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ తుపాకీలను కేంద్రమంత్రిత్వ శాఖ కానీ కొనుగోలు చేస్తే.. వాటిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్రాడ్ కు అందించనున్నారు. డీజీపీ లాంటి అత్యున్నత స్థాయి అధికారి ఇలాంటి సాహసం చేయటం గ్రేట్ అని.. అంతటి దమ్ము చాలా చాలా తక్కువ డీజీపీలకు మాత్రమే ఉందన్న మాట పలువురు చెబుతున్నారు.