Begin typing your search above and press return to search.

కరోనా మద్యే మొదటిరోజే 7 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు !

By:  Tupaki Desk   |   16 Jan 2021 5:48 AM GMT
కరోనా మద్యే  మొదటిరోజే  7 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు !
X
ఉత్తరాఖండ్‌ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తొలి రోజే 7 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. హరిద్వార్‌ గంగానదిలో మొత్తం ఏడు లక్షల 11 వేల మంది భక్తులు హారతిలో పాల్గొన్నారని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ ప్రోట్‌ కాల్‌ ప్రకారం పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించింది. గురువారం రోజు కరోనా వైరస్ ‌ నిబంధపలే ఉల్లంఘించిన 974 మంది జరిమానా కూడా విధించారు.

ఇటు కుంభమేళాకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1000 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు . ప్రతిసారి 105 రోజుల పాటు నిర్వహించే కుంభమేళాను ఈ సారి కరోనాతొ 48 రోజులకు కుదించారు. మాస్కులను ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి కనీస నిబంధనలను తప్పనిసరిగా పాటించి తీరాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సినిమా థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. శుభకార్యాలకు హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యపైనా పరిమితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కుంభమేళా 2021 ప్రారంభమైంది.

గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. భక్తి ప్రపత్తులతో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని 14వ తేదీన ప్రారంభమైన కుంభమేళా, ఏప్రిల్ 27వ తేదీ వరకు కొనసాగుతుంది. ఛైత్రమాసం పౌర్ణమితో ముగుస్తుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి, సోమావతి అమవాస్య, బైసాఖీ, శ్రీరామ నవమి, చైత్ర పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.

2021 కుంభమేళాలో నదీ స్నానాలు ఆచరించడానికి ప్రత్యేకమైన రోజులు
జనవరి 14న - మకర సంక్రాంతి
ఫిబ్రవరి 11న - మౌని అమావాస్య
ఫిబ్రవరి 16న - వసంత పంచమి
ఫిబ్రవరి 27న - మాఘ పూర్ణిమ
మార్చి 11న - మహా శివరాత్రి (షాహిస్నాన్)
ఏప్రిల్ 12న - సోమవతి అమవాస్య (షాహిస్నాన్)
ఏప్రిల్ 14న - బైసాకి (షాహిస్నాన్)
ఏప్రిల్ 21న - శ్రీరామ నవమి
ఏప్రిల్ 27న - చైత్ర పూర్ణిమ (షాహిస్నాన్)