Begin typing your search above and press return to search.
పేపర్ లీకేజీలో కీలక పరిణామం ?
By: Tupaki Desk | 29 March 2023 11:12 AM GMTటీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కీలకమైన పరిణామాన్ని గుర్తించినట్లు సమాచారం. అదేమిటంటే టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న 121 మందికి ప్రశ్నపత్రం ముందుగానే అందిందని గట్టిగా అనుమానిస్తోందట. అందుకనే మొదటి 121 ర్యాంకులు తెచ్చుకున్నవాళ్ళల్లో 70 మందిని పిలిపించి విచారించింది. వీళ్ళ సమాధానాలు విన్నతర్వాత వీళ్ళల్లో చాలామందికి లీకైన ప్రశ్నపత్రం అందిందని నిర్ధారించుకున్నట్లు తెలిసింది.
ర్యాంకులు తెచ్చుకున్న మిగిలిన అభ్యర్ధులను కూడా విచారించేందుకు పిలిపిస్తోంది. ఇపుడు ర్యాంకులు తెచ్చుకున్న అభ్యర్ధుల నేపధ్యాన్ని బట్టి వీళ్ళ సామర్ధ్యాన్ని సిట్ అంచనా వేస్తోంది.
ఇదే సమయంలో గ్రూప్ 1 లో వీళ్ళు రాసిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపేపర్లను మళ్ళీ ఇచ్చి సమాధానాలు రాబడుతోందట. దాంతో వీళ్ళ కెపాసిటి ఏమిటో ప్రత్యక్షంగా సిట్ ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. నిజంగాన కష్టపడి చదివిన అభ్యర్ధులైతే ప్రశ్నపత్రానికి నిర్భయంగా సమాధానాలిస్తారనేది సిట్ అధికారుల ఆలోచన.
పరీక్ష జరిగినపుడు సమాధానాలు రాసినట్లుగా ఇపుడు రాయలేకపోయినా దానికి కనీసం దగ్గరగా అయనా సమాధానాలిస్తారని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో ప్రశ్నపత్రాన్ని ముందే సంపాదించి ఆ ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్లు ప్రిపేరై పరీక్ష రాసుంటే ఇపుడు సమాధానాలు రాసేటపుడు వాళ్ళ కెపాసిటి ఏమిటో తేలిపోతుంది. ప్రశ్నలను కాస్త మార్చి ఇచ్చినపుడు అభ్యర్ధుల సామర్ధ్యం ఏమిటో అధికారులు ప్రత్యక్షంగా చూడగలిగినట్లు సమాచారం.
ఇలాంటి విచారణ ద్వారానే ప్రశ్నపత్రం లీకైందని ఇప్పటికే నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకున్న వారికి ఆ క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుండి వచ్చిందనే విచారణతో మొదలుపెట్టి ఎంతమందికి ప్రశ్నపేపర్లు అందిందని కూడా అధికారులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికి షమీమ్, రమేష్, సురేష్, ప్రవీణ్, డాక్యా లాంటి అనేకమందిని సిట్ అరెస్టుచేసింది.
టీఎస్ పీఎస్సీ బోర్డులోని అధికారుల పాత్రపైన కూడా సిట్ వివరాలు సేకరిస్తోంది. తొందరలోనే విచారణ ఒక కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రశ్నపత్రం లీకేజీలో మంత్రి కేటీయార్ తదితరుల పాత్రపైన మాత్రం అధికారులు ఎవరూ నోరిప్పటంలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.