Begin typing your search above and press return to search.

సెంటిమెంటును ప్రయోగిస్తున్న దేవేగౌడ ?

By:  Tupaki Desk   |   29 April 2023 2:00 PM GMT
సెంటిమెంటును ప్రయోగిస్తున్న దేవేగౌడ ?
X
కర్నాటక ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలనే తపనతో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు. 90 ఏళ్ళ వయసులో ఉన్న దేవేగౌడ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తనంతట తాను లేవలేరు, కూర్చోలేరు.

ఎదుటివాళ్ళు మాట్లాడినా తొందరగా వినబడదు. ఇలాంటి పరిస్థితుల్లో తన పార్టీని విజయతీరాలకు చేర్చాలని కంకణం కట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో జేడీఎస్ కు పెద్ద సానుకూల ఫలితాలు వస్తాయని ఏ ప్రీపోల్ సర్వేలో కూడా బయటపడలేదు.

అనేక సర్వే రిపోర్టుల్లో జేడీఎస్ కు మహాయితే 25 సీట్ల కు మించి రావని తేలిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వస్తుందని కూడా తేలింది. తాగా ఈదిన. కామ్ ప్రకటించిన సర్వేలో కాంగ్రెస్ కు 140 సీట్ల దాకా వస్తుందని చెప్పింది. ఏదో హంగ్ అసెంబ్లీ వచ్చేట్లయితే గతంలో లాగే తన కొడుకు కుమారస్వామి ముఖ్యమంత్రి అయిపోతారని దేవే గౌడ అంచనా వేశారు. అయితే అలాంటి పరిస్థితులు లేవని తేలిపోతోంది. అందుకనే వీల్ చక్రాల కుర్చీలోనే కూర్చుని ప్రచారం చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జేడీఎస్ కు ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే హంగ్ అసెంబ్లీ కి అంత అవకాశాలు పెరుగుతాయి. రాబోయే ఎన్నికల్లో గణనీయ మైన సీట్లు సాధించటం జేడీఎస్ కు ఎలాగూ అవకాశం లేదు. అందుకనే కనీసం హంగ్ అసెంబ్లీ రావాలనే కోరికతే దేవె గౌడ ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచారానికి సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ పూస్తున్నారు. ప్రచారంలోకి దిగిన 63 ఏళ్ళ కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. దాంతో దేవేగౌడకు ప్రచార బాధ్యతలు తప్పలేదు.

గడచిన 11 రోజుల్లో 40 నియోజకవర్గాల్లో దేవేగౌడ చక్రాల కుర్చీలో కూర్చునే ప్రచారం చేస్తున్నారు. బహిరంగ సభలైనా, రోడ్డుషోలైనా అంతా చక్రాల కుర్చీలో కూర్చునే. 89 ఏళ్ల వయసులో కూడా ప్రజల ముందుకొస్తున్న తనను చూసి జేడీఎస్ కు ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నారు. బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీల్లో పాల్గొనేందుకు ఒక్కోసారి దేవేగౌడ 70 కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తున్నారు. మే 10వ తేదీన పోలింగ్ కాబట్టి 8వ తేదీ సాయంత్రం వరకు ప్రచారంచేస్తునే ఉంటానని దేవెగౌడ చెప్పటం గమనార్హం.