Begin typing your search above and press return to search.
208 చార్టర్డ్ విమానాలు 100 BMW లు పాప్ స్టార్ షో.. పెళ్లి ప్యాకేజీ 150 కోట్లు!?
By: Tupaki Desk | 11 April 2023 4:00 PM GMTవ్యాపారవేత్త సంజయ్ హిందూజా దేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు. అతడు విలాసవంతమైన భారీ వివాహ వేడుకలో తన ప్రియురాలు అను మహతానిని వివాహం చేసుకున్నాడు. సంజయ్ హిందుజా - అను మహతానీల వివాహం భారతీయ చరిత్రలో ఎన్నటికీ మరువలేనిది. ఇది రాజస్థాన్- ఉదయపూర్ లోని అత్యంత విలాసవంతమైన రిసార్ట్ లలో అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోనియ పాపులర్ వెడ్డింగ్స్ లో ది బెస్ట్ ఈవెంట్ ఇది. ఏడు రోజుల పాటు వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి.
సంజయ్ హిందుజా-అను మహతాని వివాహానికి సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే.. ఈ పెళ్లికి 16000 మంది అతిథులు హాజరు కాగా.. హిందూజాల వారసుడి వివాహానికి మొత్తం ఖర్చు దాదాపు రూ. 150 కోట్లు. వివాహం భారతీయ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. అతిథులందరికీ భారతీయ వస్త్రధారణ తప్పనిసరి.
ఈ వేడుకలో హైలైట్ ఏమిటంటే.. పాప్ సంచలనం జెన్నిఫర్ లోపెజ్ ప్రదర్శన. కేవలం కొన్ని గంటల ప్రదర్శన కోసం దాదాపు రూ. 54 లక్షలు వసూలు చేసిందిట. గాయని నికోల్ షెర్జింగర్ కూడా ఈ వేదికపై కనిపించారు. సదరు గాయనీమణి దాదాపు రూ. 40 లక్షలు వసూలు చేసింది. కేవలం గాయకుల కోసమే కోటి ఖర్చు చేసారు.
ఉదయపూర్ లో అతిథులందరినీ ల్యాండ్ చేయడానికి దాదాపు 208 చార్టర్డ్ విమానాలు ఉపయోగించారు. దీని కోసమే దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేశారు. ఇదే కాకుండా అతిథుల సౌకర్యార్థం వందలాది BMW కార్లను అద్దెకు తీసుకున్నారు.
అన్నింటికీ ప్రైవేట్ డ్రైవర్ల ను ఏర్పాటు చేసారు. ఇంకా.. వధువు అను మహతాని అద్భుతమైన ఎరుపు బంగారు రంగు లెహంగాను పెళ్లి కోసం డిజైన్ చేసారు. దీనిని తరుణ్ తహిలియానీ రూపొందించారు. కేవలం ఈ లెహంగా ధర రూ. 2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వధూవరుల దుస్తుల ఖర్చే రూ.10 కోట్లకు పైమాటే.
మలైకా అరోరా- అర్జున్ కపూర్- రణవీర్ సింగ్- ప్రీతి జింటా- సంజయ్ కపూర్- సోహైల్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ దిగ్గజాలు సంజయ్ హిందుజా ఏడు రోజుల వివాహ వేడుకలకు ఎటెండయ్యారు. అంతకుమించి ఇండస్ట్రీ బెస్ట్ వ్యాపారవేత్తలు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. వివాహ వేడుకల్లో 16 దేశాల వంటకాలతో విందును అత్యంత భారీగా ఏర్పాటు చేసారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చయింది.