Begin typing your search above and press return to search.
గడ్డకట్టిన వెయ్యి వ్యాక్సిన్ షాట్లు .. నిర్లక్ష్యం ఎవరిది ?
By: Tupaki Desk | 20 Jan 2021 9:08 AM GMTప్రస్తుతం దేశంలో నిర్విరామంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడక్కడా కొన్ని దుష్పలితాలు మినహా వ్యాక్సినేషన్ ప్రక్రియ సూపర్ సక్సెస్ అయింది. ఇక దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అందజేయడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు అని ఇప్పటికే వెల్లడించారు. అందుకే దశల వారీగా , వైరస్ తీవ్రతను బట్టి ఇస్తూ పోతున్నారు. ఈ సమయంలో వ్యాక్సిన్ ను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. ఒక్క వ్యాక్సిన్ డోస్ పాడైనా కూడా ఒకరి ప్రాణం పోయినట్టే. ఇలాంటి సమయంలో వెయ్యి వ్యాక్సిన్ డోస్ లను అధికారులు నాశనం చేశారు.
అస్సాంలోని కాచర్ జిల్లాలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ వద్ద కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అధికారులు నాశనం చేసారు. సుమారు 1,000 మోతాదుల వ్యాక్సిన్ నాశనం అయినట్టు గుర్తించారు. టీకాను ఎస్ ఎంసిహెచ్ లోని వ్యాక్సిన్ స్టోర్ యూనిట్‌లో నిల్వ చేసినట్టు గుర్తించారు. 1,000 మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని 100 కుండలలో ఉంచారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. అయితే సిల్చార్ మెడికల్ కాలేజ్ ,హాస్పిటల్ లో మైనస్ డిగ్రీలలో నిల్వ చేసారు. టీకాలు పాక్షికంగా గడ్డ కట్టుకుపోయాయి అని కాచర్ జిల్లాలోని ఒక ఆరోగ్య అధికారి తెలిపారు.
ఐస్-లైన్డ్ రిఫ్రిజిరేటర్ లో కొంత సాంకేతిక లోపం ఉండవచ్చు అని అధికారులు అన్నారు. మేము సాధారణంగా 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఐ ఎల్ ఆర్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తామని అక్కడి అధికారి చెప్పారు. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, యంత్రం ఒక సందేశాన్ని పంపుతుంది అని… కానీ మా వ్యాక్సినేటర్ కు ఎటువంటి సందేశం రాలేదు అని అన్నారు. చాలావరకు ఇది సాంకేతిక లోపం అని వెల్లడించారు. టీకాలు రాత్రంతా నిల్వ ఉన్నా సరే సాంకేతిక లోపం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి అని తెలిపారు. దీనితో అస్సాం ఆరోగ్య శాఖ కోవిషీల్డ్ 100 కుండీల 1,000 బ్యాచ్లను సిల్చార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ కు పంపాలని నిర్ణయించింది. కానీ టీకాలు గడ్డకట్టి పాడైపోయిన కారణం మాత్రం దర్యాప్తు చేస్తున్నారు . ఒకపక్క కరోనా వ్యాక్సిన్ లను ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంటే సాంకేతిక లోపమో , మానవ తప్పిదమో కానీ వెయ్యి వ్యాక్సిన్ మోతాదులు అనవసరంగా నాశనం అయ్యాయి.