Begin typing your search above and press return to search.
తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో ఉన్న బాలకృష్ణ ... నేను మాట్లాడను : డిప్యూటీ సీఎం
By: Tupaki Desk | 8 Jan 2021 7:37 AM GMTసాధరణంగా ఎక్కడైనా కూడా రాజకీయ విమర్శలు , ప్రతివిమర్శలు అనేవి ఎన్నికల ముందు కొంచెం హాట్ హాట్ గా సాగుతాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఏదైనా చేయరాని పెద్ద తప్పు ఏదైనా చేస్తే అడపాదడపా విమర్శలు చేస్తుంటారు ప్రతిపక్ష సభ్యులు. అయితే , ఏపీలో మాత్రం ఎన్నికలు జరిగి ఏడాదిన్నర దాటినా కూడా ఎన్నికల వేడి ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా విపక్షం , ప్రభుత్వం విమర్శలు చేసుకుంటూ రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి.
ఇదిలా ఉంటే .. తాజాగా రాష్ట్రంలో దేవాలయాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు , విగ్రహాల ధ్వంసం జరుగుతున్నాయి. దీనిపై రాజకీయ దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలోనే దేవాలయాల ఘటనలపై హిందూపురం ఎమ్మెల్యే , నందమూరి బాలకృష్ణ జగన్ సర్కార్ పై పలు విమర్శలు చేశారు. దీనికి తాజాగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోని లేని వారే పదవి కోసం పాకులాడుతూ కుల, మతాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ .. చంద్రబాబుకు మతి తప్పిందని, తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో ఉన్న బాలకృష్ణ గురించి తానేమి మాట్లాడబోను అన్నారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మత, కుల ద్వేషాలను రెచ్చగొట్టి పరిపాలించాల్సిన అవసరం లేదని, చంద్రబాబు తన హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్నారన్నారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు కొందరు ఆలయాల పేరుతో ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.