Begin typing your search above and press return to search.
నగదు రహిత చంద్రబాబుకు ఇంట్లోనే చుక్కెదురు
By: Tupaki Desk | 29 Dec 2016 8:36 AM GMTమోడీ పెద్ద నోట్లను రద్దు చేయడానికి తన సలహాయే కారణమని... ఇప్పుడు అంతా క్యాష్ లెస్ విధానంలోకి మారాలని నిత్యం చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్షాలు సరికొత్త విమర్శలు చేస్తున్నాయి. ముందు ఇంట్లో అన్నీ చక్కదిద్ది ఆ తరువాత వీధికి పెద్దరికం వహించాలని చురకలేస్తున్నాయి. ఇందుకు కారణం కూడా ఉంది... క్యాష్ లెస్ గా మారాలంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు తాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆగమేఘాలమీద నిర్మించిన వెలగపూడి సచివాలయంలో ఇంతవరకు క్యాష్ లెస్ దిశగా ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదట.
రాష్టమ్రంతా నగదు రహిత విధానంపై ప్రచారం చేస్తూ, ఎక్కడికక్కడ స్వైపింగ్ మిషన్లు పెట్టుకోవాలని చెబుతున్న ప్రభుత్వం, సచివాలయంలోని క్యాంటిన్‌లో మాత్రం స్వైపింగ్ మిషన్లు పెట్టించలేదు. స్వైపింగ్ మిషన్లు - ఆధార్ ఆధారిత కొనుగోళ్లపై ఇటీవల కలెక్టర్లు - మంత్రులకు క్లాసులిచ్చిన ముఖ్యమంత్రి - తనతో సహా అందరినీ వాటి ఆధారంతో వస్తువులు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కానీ రోజూ 700 నుంచి వెయ్యి మంది వరకూ వచ్చే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ క్యాంటిన్‌లో మాత్రం - ఇప్పటివరకూ స్వైపింగ్ మిషన్లు లేవు. దీంతో అక్కడ నగదు కొరత, చిల్లర కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ నుంచి వచ్చిపోయే సచివాలయ ఉద్యోగులు ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరే రైలులో వస్తుండడంతో వారిలో చాలామంది భోజనం తెచ్చుకోలేని పరిస్థితి. అలాటి వారందరికీ క్యాంటీనే ఆధారం. నోట్ల లభ్యత లేని తరుణంలో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా... సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు కూడా భోజనం కోసం క్యాంటీన్ పైనే ఆధారపడాలి. కానీ, చంద్రబాబు చెబుతున్న డిజిటల్ మనీ - క్యాష్ లెస్ సిస్టం అక్కడ లేకపోవడంతో షాక్ కు గురవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/