Begin typing your search above and press return to search.
గర్బవతి అయిన మైనర్.. ఎవరికీ తెలియకుండా యూట్యూబ్ లో చూసి ఇంట్లోనే డెలివరీ!
By: Tupaki Desk | 30 Oct 2021 3:30 AM GMTఓ బాలిక పెళ్లి కాకుండానే తల్లి అయింది. పైగా ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. నవమోసాలు మోసింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యూట్యూబ్ లో చూసి మరీ డెలివరీ చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని మలప్పురంలో ఓ పదిహేడేళ్ల బాలిక పెళ్లికాకముందే గర్భం దాల్చింది. తాను వివాహం చేసుకోబోయే వ్యక్తితో శారీరకంగా కలవడం వల్ల ఆ బాలిక గర్భవతి అయింది. అయితే ఇదంతా ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడింది. బిడ్డకు జన్మనిచ్చేదాకా ఈ విషయం బయటకు రాలేదు.
బాలిక తల్లి పాక్షిక అంధురాలు. పదిహేడేళ్ల బాలిక మరియు ఆమె తల్లి కలిసి కొట్టకల్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వారి ఇంటికి సమీపంలో ఉండే ఓ వ్యక్తితో బాలిక ప్రేమలో పడింది. ఇరువురూ ఇష్టపడ్డారు. ఫలితంగా ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించారు. బాలికకు 18 ఏళ్ల నిండిన తర్వాత వివాహం చేయాలని నిర్ణయించారు. ఎలాగు పెద్దలు అంగీకరించడంతో వారిద్దరూ చనువుగా మెలిగారు. ఈ క్రమంలోనే శారీరకంగా కలవడం వల్ల బాలిక గర్భం దాల్చింది. పైగా ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లో ఎవరికీ తెలియనీయలేదు. ఆన్ లైన్ తరగతుల పేరిట తరుచూ ఫోన్ పట్టుకొని తన గదిలోనే ఉండేది. అలా యూట్యూబ్ లో డెలివరీ చేయడం గురించి తెలుసుకుంది.
యూట్యూబ్ పరిజ్ఞానంతో డెలివరీ గురించి అవగాహన పొందంది. అలా ఎంతో సాహసం చేసి తానే డెలివరీ చేసుకుంది. ఇంకేం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాకపోతే ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. అంతాబాగుంది కాబట్టి ప్రమాదం లేదు కానీ జరగరానిది జరిగితే తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పు ఉండేది. అయితే యూట్యూబ్ లో చూసి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా ఇంట్లో తల్లికి సైతం తెలియకుండా జాగ్రత్త పడింది. పాక్షిక అంధురాలైన తల్లి... పసికందు ఏడుపుతో ఆరా తీసింది. అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు శబ్ధాన్ని గ్రహించిన ఆమె దీనిపై కూతురిని ప్రశ్నించింది. కాగా ఆ సమయంలో బాలిక అసలు విషయాన్ని బయటకు చెప్పింది. వెంటనే అప్రమత్తమైన ఆ తల్లి... బాలికను, పసికందును ఆస్పత్రికి తీసుకెళ్లింది.
బాలికతో పాటు పసికందును మంజేరీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. యూట్యూబ్ లో చూసి డెలివరీ చేయడంతో బాలికకు కాస్త ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. అందుకు చికిత్స అందినట్లు వెల్లడించారు. కాగా పసికందు ఆరోగ్యం మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. ఈ గర్భానికి కారణమైన 21 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. కాకపోతే బాలిక అతడితో రిలేషన్ లో ఉన్నందున కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదు. దీనిపై అక్కడి వైద్యాధికారులు తీవ్రంగా స్పందించారు. చిన్నారులు యూట్యూబ్ లో చూసి ఇలాంటి సంఘటనలకు పాల్పడడం ప్రాణాలతో చెలగాటం అని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తల్లీబిడ్డలకు ప్రమాదం ఉంటుందని తెలిపారు. స్మార్ట్ ఫోన్లతో ఎంత లాభం ఉందో... అంతకు మించిన నష్టం ఉందని అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. యూట్యూబ్ డెలివరీ అసలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.