Begin typing your search above and press return to search.
ప్రభాకర్ కే పంచ్ పడిందా ?
By: Tupaki Desk | 17 Aug 2021 4:30 PM GMTపంచ్ ప్రభాకర్ పరిచయం అవసరం లేని సోషల్ మీడియా యాక్టివిస్టు. ప్రభాకర్ ను వైసీపీకి ప్రధాన మద్దతుదారుడు, వీర విధేయుడనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళని, ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసేవాళ్ళపై ప్రభాకర్ తన పంచులతో విరుచుకుపడుతుంటారు. అమెరికాలో ఉండే ప్రభాకర్ జగన్ ప్రత్యర్ధులపై విరుచుకుపడటంలో చాలాసార్లు హద్దులు దాటుతారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
ఎక్కడో అమెరికాలో ఉన్నారన్న ధీమాతో తెలుగుదేశంపార్టీ నేతలపై నోటికొచ్చినట్లు విరుచుకుపడుతుంటారు. ఇలాంటి ప్రభాకర్ పై వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తిరుగుబాటు ఎంపిపైన కూడా ప్రభాకర్ తనదైన శైలిలో యూట్యూబ్, ఫేస్ బుక్ లో నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దాంతో ఎంపి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు వెంటనే ఐపీసీ 504, 506 సెక్షన్ల క్రింద కేసులు నమోదుచేశారు.
ప్రభాకర్ పై కేసులు నమోదు చేయటమే కాకుండా యూట్యూబ్, ఫేస్ బుక్ యాజమాన్యాలకు కూడా పోలీసులు నోటీసులు జారీచేశారు. తిరుగుబాటు ఎంపితో పాటు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు అనేకమంది ప్రముఖులపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారట. ఢిల్లీ కోర్టు అనుమతి తీసుకుని ప్రభాకర్ పై కేసులు నమోదుచేసిన పోలీసులు అమెరికా నుండి ఇండియాకు ప్రభాకర్ ను రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
గతంలో ఏపి హైకోర్టు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో ప్రభాకర్ కూడా ఉన్నాడట. ఇప్పటికే సీఐడీ నమోదుచేసిన కేసుల్లో ప్రభాకర్ పైన కూడా కొన్ని ఉన్నాయట. తిరుగుబాటు ఎంపి తన ఫిర్యాదులో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారట. ఢిల్లీ పోలీసులకు సీఐడీ కూడా ఓ నివేదిక ఇవ్వబోతోందని సమాచారం. కాబట్టి ప్రభాకర్ ను గనుక ఇండియాకు రప్పిస్తే ప్రభాకర్ పై ఒకవైపు కోర్టులు, మరోవైపు ఢిల్లీ పోలీసుల పంచులు పడటం ఖాయమనే అనిపిస్తోంది.