Begin typing your search above and press return to search.
జగన్ మీద ఢిల్లీ ఎంపీ పవర్ ఫుల్ పంచ్
By: Tupaki Desk | 23 Jan 2023 9:12 AM GMTఏపీ సీఎం జగన్ ఇపుడు జాతీయ స్థాయిలో కూడా నానుతున్నారు ఏపీకి వచ్చిన వారంతా ఆయన్ని స్మరించకుండా ఉండలేకపోతున్నారు. అయితే అది పాజిటివ్ వేలో కాదు నెగిటివ్ గానే వారు జగన్ని తలచుకుంటున్నారు. బీజేపీ సభకు విశాఖ వచ్చిన ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ జగన్ కి అతిధి దేవో భవ అన్న నానుడి కూడా తెలియదా అని సూటిగా నిలదీశారు. వచ్చిన అతిధిని గౌరవించకపోవడం దారుణం అంటూ భారీ పంచ్ వేశారు.
తాను ఢిల్లీ నుంచి వస్తే విశాఖ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున ర్యాలీని బీజేపీ శ్రేణులు నిర్వహించాయని, అయితే పోలీసులు తన స్వాగత ర్యాలీని అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇదెక్కడ పాలన ఇదెక్కడ విధానమని ఆయన గుస్సా అయ్యారు.
తాను ఏపీకి అతిధిని అని తనను గౌరవించాల్సిన బాధ్యత లేదా అని ఆయన ఫైర్ అయ్యారు. తనకు వెల్ కం చెప్పడానికి వచ్చిన రెండు వందల బైకు ర్యాలీని చూసి ఏపీ సర్కార్ కంగారు పడుతోందని ఆయన సెటైర్లు వేశారు. ఇది మంచి విధానం కాదని ఆయన అన్నారు.
తనను విశాఖ రమ్మని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో పిలిస్తే ఇన్నాళ్ళకు సాధ్యపడింది అని ఆయన అన్నారు. పాలకుల తీరు ఎలా ఉన్నా విశాఖ వాసుల ప్రేమ మాత్రం చాలా గొప్పదని ఆయన పొగిడారు వారిది సముద్రమంత విశాలమైన అనురాగం అంటూ కీర్తించారు.
విశాఖ అంటే తనకు ఇష్టమని మళ్ళీ మళ్ళీ వస్తానని ఆయన చెబుతూ భోజ్ పురిలో ఒక పాటను పాడి మరీ సభికులను ఉత్సాహపరచారు. దేశమంతా మోడీ అని అంటోందని, ఆయన ప్రపంచం గెలిచిన నాయకుడు అని మనోజ్ తివారీ చెప్పడం విశేషం. బీజేపీ దేశానికి అవసరం అయిన పార్టీగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో రాజకీయ నాయకుల టూర్లకు ఏపీ సర్కార్ అడ్డు చెబుతోందన్న విమర్శలు ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చిన ఎంపీ విషయంలోనూ ఈ విధంగానే వ్యవహరించడంతో ఇపుడు ఏపీ పోలీసుల గురించి ప్రభుత్వం గురించి జాతీయ స్థాయిలో కూడా చర్చకు ఆస్కారం ఏర్పడింది అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం ఎవరు ర్యాలీలు తీసినా రోడ్ల మీదకు వచ్చినా ఊరుకోవడం లేదన్న సంకేతం వెళ్ళిపోయింది. మరి ఇది మంచికా చెడ్డకా అన్నది జనాలే డిసైడ్ చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.