Begin typing your search above and press return to search.
ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
By: Tupaki Desk | 14 March 2023 5:00 AM GMTఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు పెంచింది. ఇప్పుడున్న జీతాలను ఏకంగా 66 శాతం పెంచేసింది. మార్చి 17 నుండి ప్రారంభమయ్యే ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు శుభవార్తను అందించింది.
ఢిల్లీ ప్రభుత్వ న్యాయ విభాగం నోటిఫికేషన్ ప్రకారం.. 66 శాతం జీతాల పెంపుతో ఎమ్మెల్యేలకు ఇప్పుడు నెలకు రూ. 90 వేలు లభించనుంది. గతంలో రూ.54,000 మాత్రమే ఉన్న జీతాలను అమాంతం పెంచుతూ ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ప్రతిపక్ష నేతలకు కూడా జీతం, అలవెన్సులు భారీగా పెరిగాయి. వీరందరికీ నెలకు రూ.72 వేల నుంచి రూ.1 లక్షా 70 వేలకు పెంచినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఎమ్మెల్యేల మూల వేతనాన్ని నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేలకు పెంచింది. మంత్రులకు నెలకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు మూల వేతనాన్ని పెంచారు. ఇక రోజువారీ భత్యం కూడా రూ.1,000 నుంచి రూ.1,500కి పెంచారు.
కాగా గత ఏడాది జూలై 4న ఎమ్మెల్యేల జీతాలను పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఆ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో 12 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగినటై్టంది. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 మంది ఎమ్మెల్యేల జీతాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి రానున్నాయి.
ఇక, మాజీ ఎమ్మెల్యేల పెన్షన్లు కూడా పెరిగాయి. ఇంతకు ముందు కేవలం నెలకు రూ.7,500 అందుకునే వారికి ఇక నుంచి నెలకు 15,000 రూపాయలు అందుతాయి.
జీతాల పెంపుపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ విప్ దిలీప్ కుమార్ పాండే స్పందించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల జీతాలు పెరిగినప్పటికీ.. ఈ జీతాలు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలతో పోల్చితే చాలా తక్కువేనని గుర్తుచేశారు.
2015లో ఓ సారి ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచడానికి ప్రయత్నించింది. 2.10 లక్షల నెల జీతం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ కొట్టిపారేసింది.
కాగా తెలంగాణలో ఎమ్మెల్యేలకు నెలకు రూ.20 వేల జీతం మాత్రమే ఇస్తున్నప్పటికీ నెలకు అలవెన్సులు తదితరాల కింద రూ.2.3 లక్షల జీతం అందుతోంది.
అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా నెలకు ఎమ్మెల్యేలకు రూ.55 వేలు, నియోజకవర్గ అలవెన్స్ కింద రూ.90 వేలు, డైలీ అలవెన్స్ కింద రూ.1800, సెక్రటేరియల్ అలవెన్స్ కింద రూ.30 వేలు, టెలిపోన్ అలవెన్స్ కింద నెలకు రూ.15 వేలు ఇస్తున్నారు. ఇవే కాకుండా పలు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలకు నెలకు లక్షల రూపాయల్లో జీతాలు అందుతున్నాయి. వీటికి ఇతర అలవెన్సులు అదనం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.