Begin typing your search above and press return to search.

మెట్రోలో రోమాన్స్ : ముద్దుపెట్టుకుంటున్నావా? సీపీఆర్ చేస్తున్నావా?

By:  Tupaki Desk   |   11 May 2023 5:00 AM GMT
మెట్రోలో రోమాన్స్ : ముద్దుపెట్టుకుంటున్నావా? సీపీఆర్ చేస్తున్నావా?
X
ఢిల్లీ మెట్రో రైలులో ఓ ప్రేమ జంట అందరిముందే రెచ్చిపోయిన వైనం వైరల్ అయ్యింది. ఇప్పటికే ఓ యువతి బికినీ వేసుకొని తిరిగి ఢిల్లీ మెట్రోలో కలకలం సృష్టించింది. అది మరిచిపోకముందే మరో ఉపద్రవం చోటుచేసుకుంది. ఒక యువ ప్రేమ జంట ఢిల్లీ మెట్రోలో ఉద్వేగభరితంగా ముద్దు పెట్టుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులను ఆగ్రహానికి గురి చేసింది. ఒక అబ్బాయి అబ్బాయికి ముద్దు పెడుతూ రోమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇది చూసి ప్రయాణికులు ఆమె సొమ్మసిల్లి పడిపోయిందా? ఆ అబ్బాయి ఆ అమ్మాయికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేస్తున్నాడా? అని సందేహపడ్డారు. కొందరికి అతడి చర్య సీరియస్‌గా అనిపించగా, మరికొందరు సాదాసీదాగా ఇదేదో రోమాన్స్ వ్యవహారమని సెటైర్లు వేశారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను తోటి ప్రయాణీకుడు రికార్డ్ చేశాడు. క్లిప్‌లో, అమ్మాయి ఒడిలో పడుకున్నప్పుడు అబ్బాయి నేలపై కూర్చున్నట్లు ఉంది. వారు ఉద్వేగభరితంగా ముద్దుపెట్టుకోవడం కనిపించింది.

సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జంట "సిగ్గులేనివారు" అని దుమ్మెత్తిపోశారు. అందరి ముందే అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను కోరారు.

"ప్రజలు ఎలా మౌనంగా ఉంటారు. వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరా?"అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. ఇది నిజమైన ప్రేమా లేక సోషల్ మీడియా కోసమేనా? అని డౌట్ పడ్డారు. ఇది రీల్స్ కోసం చేసిందని కొందరు నిందించారు.

ఈ విషయమై డీఎంఆర్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. "ఢిల్లీ మెట్రోను ఉపయోగిస్తున్నప్పుడు దాని ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని.. సమాజంలో ఆమోదయోగ్యమైన అన్ని సామాజిక మర్యాదలు.. ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఢిల్లీ మెట్రో స్పష్టం చేసింది. ప్రయాణికులు అసౌకర్యాన్ని కలిగించే లేదా ఇతర తోటి ప్రయాణీకుల మనోభావాలను కించపరిచే ఎలాంటి అసభ్య/అశ్లీల కార్యకలాపాలలో పాల్గొనకూడదని తెలిపింది. ఢిల్లీ మెట్రో ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ యాక్ట్ ఇన్ఫాక్ట్ సెక్షన్-59 ప్రకారం అసభ్యతను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని తెలిపింది.