Begin typing your search above and press return to search.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ కీలక నేత.. 100 కోట్లు హైదరాబాద్ నుంచే వెళ్లాయి: ఈడీ వెల్లడి
By: Tupaki Desk | 20 Nov 2022 7:51 AM GMTదేశ రాజధాని ఢిల్లీ సహా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ మరిన్ని విషయాలను వెల్లడించింది. ఈ స్కామ్‌లో అభిషేక్ బోయినపల్లిది కీలక పాత్ర అని సీబీఐ ప్రత్యేక కోర్టు కు ఈడీ పేర్కొంది. వైసీపీ ఎంపీ బంధువు, అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ పి. శరత్ చంద్రారెడ్డి భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్ నుంచి దాదాపు రూ.100 కోట్ల ముడువులు చెల్లించడంలో అభిషేక్ బోయినపల్లి కీలకంగా వ్యవహరించారని తమ దర్యాప్తులో తేలినట్లు వివరించింది.
ఆ మొత్తం ముడుపుల్లో రూ.50 కోట్లను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హవాలా మార్గంలో తరలించినట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో వందల కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరినట్లు కోర్టుకు ఈడీ వివరించింది. అభిషేక్ బోయినపల్లి ఐదురోజుల ఈడీ కస్టడి ముగిసిన నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. "ఈ ఐదు రోజుల్లో నిందితులిద్దరిని విచారించాం. ఇండా లోతుగా విచారించాల్సి ఉంది. మరో 9 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వండి" అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు, శరత్ చంద్రారెడ్డి కంపెనీకి చెందిన సీఈవో చందన్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబుతో అభిషేక్‌ను ముఖాముఖి కూర్చోబెట్టి విచారించాల్సి ఉందని కోర్టుకు వివరించారు. దీంతో న్యాయమూర్తి మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. ఇదిలావుంటే, ఈ కుంభకోణంలో తెలంగాణకు చెందిన ఓ ముఖ్యనేత చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఆ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్ భారతి పలు మార్లు భేటీ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఎన్నారై షరీప్ ఈ బేటీల్లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. దీంతో ఈ ముగ్గురి పాత్రపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణకు చెందిన సదరు ముఖ్యనేత పలుమార్లు విమానాల్లో ఢిల్లీకి వచ్చినట్లు ఏఏఐ తన నివేదికలో పేర్కొన్నట్లు సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఆ నేత అనుచరులు ఢిల్లీలో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించడానికి సోమనాథ్ భారతి మార్గం సుగమం చేశారనే ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. మొత్తంగా ఈ కుంభ కోణంలో ఢిల్లీ పాత్ర కన్నా తెలంగాణ పాత్రే ఎక్కువగా ఉందని సీబీఐ,ఈడీలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.