Begin typing your search above and press return to search.
మాకు అనుకూలంగా లిక్కర్ పాలసీ ఉంటే ముడుపులు ఇస్తాం: కవితపై మరో పిడుగు
By: Tupaki Desk | 11 March 2023 8:00 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె.. ఎమ్మెల్సీ కవితపై ఈడీ మరో భారీ పిడుగు వేసింది. ఆమెకు తెలిసే అంతా జరిగిందని.. ఇప్పటి వరకు పేర్కొన్న ఈడీ.. అసలు కారుకురాలు.. ఆమేనని ఇప్పుడు పేర్కొనడం మరింత సంచలనంగా మారింది. తాజాగా ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో.. ఈడీ సంచలన విషయాలను పేర్కొంది. కుట్ర ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఎవరి వాటా ఎంత ? అనే విషయాలను ఈడీ తన రిపోర్టులో పూసగుచ్చినట్టు వివరించింది.
కుట్ర జరిగింది ఎక్కడంటే..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మొత్తం ఢిల్లీలోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లోనే జరిగిందని ఈడీ తెలిపింది. సౌత్‌గ్రూప్... దినేష్ అరోరాను హైదరాబాద్‌కు పిలిచిందని, విజయ్‌నాయర్, అర్జున్ పాండే, అభిషేక్ బోయినపల్లి, కవిత ఆడిటర్ బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కలిసే కుట్ర చేశారని ఈడీ స్పష్టం చేసింది. అంతేకాదు.. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ ఉంటే ముడుపులు ఇస్తామని కవిత ఆప్ నేతలకు చెప్పారని ఈడీ తెలిపింది. 2021 మార్చిలో విజయ్‌నాయర్‌ను కవిత కలిశారని పేర్కొంది. ఈ క్రమంలో ఆమె అంతా అయి వ్యవహరించారని కూడా ఈడీ పేర్కొనడం గమనార్హం.
ఢిల్లీ సీఎంతో కవిత దోస్తీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కవిత స్నేహం ఉందని ఈడీ తెలిపింది. ఆమెకు స్పష్టమైన రాజకీయ సంబంధాలున్నా యని, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంత మేరకు ముడుపులు ఇవ్వాలన్న అంశంపైనా కవితకు స్పష్టమైన అవగాహన ఉందని.. నేరుగా సీఎం కేజ్రీవాల్‌తోనే ఈ ఒప్పందం కుదిరిందని కవిత ఆడిటర్ బుచ్చిబాబు విచారణలో వెల్లడించారని ఈడీ తెలిపింది.
ఎవరి వాటా ఎంత?
సౌత్ గ్రూప్ మొత్తం 65 శాతం లిక్కర్ పంపిణీ, 30 శాతం రిటైల్ వ్యాపారాన్ని దక్కించుకుందని.. దీనికిగాను.. మాగుంట రాఘవకు 32.5శాతం, కవితకు 32.5శాతం... సమీర్ మహేంద్రుకు 35శాతం ఇండో స్పిరిట్స్‌లో వాటా కుదిరిందని ఈడీ వివరించింది. ఈ డీల్ కుదిరిన తర్వాతే.. సౌత్ గ్రూప్ ద్వారా వందకోట్లు ఆప్‌కు చెల్లించారని.. ఇదంతా మాగుంట రాఘవ వివరించారని ఈడీ తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.