Begin typing your search above and press return to search.
ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తాం: హైకోర్టు హెచ్చరిక
By: Tupaki Desk | 24 April 2021 4:52 PM GMTఢిల్లీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. రోగులకు చేరుదామంటే బెడ్ దొరకని పరిస్థితి. ఇటీవల ఆక్సిజన్ అందక పలువురు చనిపోయారు కూడా. సీఎం కేజ్రీవాల్ ఈ పరిణామాలు చూసి ప్రధానితో సమావేశంలో కంటతడి కూడా పెట్టాడు.
ఈ క్రమంలోనే కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర అధికారుల్లో ఎవరైనా సరే ఆక్సిజన్ తరలింపును గానీ.. సరఫరాను గానీ అడ్డుకుంటే ‘ఆ వ్యక్తిని ఉరితీస్తాం’ అంటూ సంచలన హెచ్చరికలు జారీ చేసింది.
తమ ఆస్పత్రిలో కరోనా రోగులకు ఆక్సిజన్ ఇవ్వడం లేదని మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకున్న ఒక్క సందర్భాన్ని తమ దృష్టికి తీసుకురావాలని.. అతడి తాము ఉరితీస్తామంటూ కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకునేలా వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలుపాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.