Begin typing your search above and press return to search.
రోడ్డు ప్రమాద బాధిత తల్లిదండ్రులు పరిహారానికి అర్హులే : హైకోర్టు తీర్పు
By: Tupaki Desk | 18 Jan 2021 3:36 AM GMTరోడ్డు ప్రమాదం జరిగి పిల్లలు చనిపోతే బాధిత తల్లిదండ్రులు పరిహారానికి అర్హులేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. తల్లిదండ్రులు పిల్లల పై అప్పటికప్పుడు ఆధార పడకపోయినా భవిష్యత్తులో ఆధార పడాల్సి ఉంటుందని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. 2008లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. కుమారుడి మృతితో తాను ఆధారం కోల్పోయానని తనకు పరిహారం ఇప్పించాలని అతడి తల్లి కోర్టును ఆశ్రయించింది.
అయితే ప్రమాదంలో కుమారుడు చనిపోతే బాధితుడి తల్లిదండ్రులకు పరిహారం పొందే అర్హత ఉండదని, ఎస్టేట్ నష్టానికి మాత్రమే పరిహారం అందుతుందని మోటార్ ప్రమాదాల పై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కోర్టు తీర్పు చెప్పింది. చనిపోయిన యువకుడి తండ్రి ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్ఐ గా పని చేస్తున్నారని, దీంతో వారు కుమారుడి పై ఆధారపడటం అక్కర్లేదని తెలుస్తోందన్నారు. భర్త పోలీసు శాఖలో పనిచేస్తున్నందువల్ల మరణించిన కుమారుడిపై తల్లి ఆధార పడుతున్నట్లు చెప్పలేమని కోర్టు చెప్పింది. ట్రిబ్యునల్ కోర్టు తీర్పుపై బాధితుడి తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టింది. పిల్లలు మరణిస్తే తల్లిదండ్రులు వారి పై ఆధారపడే వారిగానే పరిగణించాలని పేర్కొంది. తల్లిదండ్రులు వృద్ధులు అయ్యాక వారిని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుందని కోర్టు వెల్లడించింది. హిందూ దత్తత, నిర్వహణ చట్టం, తల్లిదండ్రుల నిర్వహణ, సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలపై ఆధారపడటానికి చట్టపరమైన హక్కులు కల్పిస్తాయని కోర్టు వివరించింది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే పిల్లల పై ఆధారపడటం కోల్పోయిన తల్లిదండ్రులకు పరిహారం నిరాకరించడం అన్యాయమే అవుతుందని పేర్కొంది. ఈ కేసులో బాధిత తల్లికి పరిహారాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది. అలాగే బాధితురాలికి అందాల్సిన పరిహారం మొత్తాన్ని రూ.2.42 లక్షల నుంచి రూ.6.8 లక్షలకు పెంచింది.