Begin typing your search above and press return to search.
ఓలా.. ఉబర్.. రాపిడోలకు షాకిచ్చిన మరో రాష్ట్రం
By: Tupaki Desk | 21 Feb 2023 2:00 PM GMTవేలాది కోట్లు ఖర్చు పెడితే కానీ నెలకొల్పలేని భారీ నెట్ వర్కును.. సాంకేతికత సాయంతో భారీగా ఆర్జిస్తున్న కంపెనీలుగా ఓలా.. ఊబర్.. రాపిడోలను చెప్పాలి. ఆన్ లైన్ రవాణాకు సంబంధించి తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న ఈ కంపెనీల తీరు చూస్తే.. కష్టం ఒకరిది.. లాభం ఇంకొకరిది అన్నట్లుగా ఉంటుంది. తాము ఎంట్రీ ఇచ్చినప్పుడు డ్రైవర్లకు భారీ లాభాలు ముట్టజెప్పి.. ఆ తర్వాత వారికి తమ పాలసీలతో చుక్కలు చూపిస్తున్న వైనం తెలిసిందే.
అయితే.. ఈ తరహా సంస్థలు తమ ప్రయోజనాలు తప్పించి.. ప్రభుత్వ నిబంధనల్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ధోరణిపై ఇప్పుడు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో క్యాబ్ సేవల సంస్థలపై బ్యాన్ పెట్టిన వైనం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర బాటలోనే నడించింది ఢిల్లీ రాష్ట్ర సర్కారు. తాజాగా ఓలా.. ఉబర్.. రాపిడో బైకు సర్వీలను నిలిపివేస్తూ ఆదేశాల్ని జారీ చేసింది.
ఒకవేళ తమ ఆదేశాల్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంతకీ ఈ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు ఏమిటి? అన్నది ఒకటైతే.. మరి తెలుగు రాష్ట్రాల మాటేమిటి? అన్నది మరో ప్రశ్న. తాజాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్ని చూసినప్పుడు ఓలా, ఉబర్, రాపిడో ఆన్ లైన్ సేవలు అందించే సంస్థల తరఫున బైకు సేవలు అందించే వారంతా తమ వాహనాల్ని ప్రైవేటు రిజిస్ట్రేషన్లు కలిగి ఉండటాన్ని ప్రశ్నిస్తోంది.
ఆన్ లైన్ సేవలకు వినియోగిస్తున్న వాహనాలు పూర్తిగా వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న నేపథ్యంలో మోటారు వాహన చట్టం 1988ను ఉల్లంఘించినట్లేనని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి మొదటిసారి చేసే నేరానికి రూ.5వేలు.. రెండోసారి చేసిన పక్షంలో రూ.10వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. జైలుశిక్ష ను కూడా అనుభవించాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు రెండు కలిపి విధించే వీలుంది. ఇంతే కాదు.. డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సును కనీసం మూడేళ్లు సస్పెండ్ చేసే వీలుందని తాజా నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి.
ఒకవేళ.. ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయిస్తే మాత్రం.. వేలాది మందికి ఇబ్బందికరంగా మారుతుంది. వాణిజ్య వాహనాల కింద రిజిస్ట్రేషన్ చేయిస్తే.. అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. అదే జరిగితే.. ఎంతో మందికి ఆర్థికంగా భారంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.