Begin typing your search above and press return to search.
30 మంది చిన్నారులను రేప్ చేసి హత్య చేసిన సైకో థ్రిల్లర్ కి శిక్ష
By: Tupaki Desk | 25 May 2023 9:44 PM GMTచిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆడవారిని కామాంధులు వదిలి పెట్టడం లేదు. అత్యంత దారుణంగా లైంగికంగా వేధిస్తూ కామ కోరిక తీర్చుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆడవారిని లైంగికంగా వేధించిన వారికి.. అత్యాచారం చేసిన వారికి అత్యంత కఠిన శిక్షలు అమలు చేసినా కూడా కామాంధులకు ఏమాత్రం భయం కలగడం లేదు. దేశవ్యాప్తంగా కూడా ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలను కూడా వదలకుండా అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసిన వారికి కఠిన శిక్షలు పడుతున్నాయి. ఇటీవల మరో కామాంధుడికి జీవిత ఖైదు శిక్ష పడింది.
30 మంది చిన్నారులను రేప్ చేసి దారుణంగా చంపేసిన సైకో కిల్లర్ కి జీవిత ఖైదు శిక్ష పడింది. 2015 సంవత్సరంలో ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపిన కేసులో రవీంద్ర కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో రవీంద్ర కుమార్ ను విచారించగా ఆ ఒక్క చిన్నారిని మాత్రమే కాకుండా.. మొత్తం 30 మందిని రేప్ చేసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు. 2008 నుండి 2015 సంవత్సరం మధ్య మొత్తం 30 మంది చిన్నారులను రేప్ చేసి చంపినట్టుగా రవీంద్ర కుమార్ అంగీకరించాడు. ఎట్టకేలకు అతనికి ఢిల్లీ రోహిణి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
యూపీకి చెందిన రవీంద్ర కుమార్ పని కోసం ఢిల్లీకి వలస వెళ్లాడు. అక్కడ 2008 సంవత్సరం నుండి చిన్నారులకు చాక్లెట్ లు.. చిల్లర పైసలు ఆశ చూపించి నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి రేప్ చేసి ఆ తర్వాత హత్య చేశాడు. రేప్ చేసిన తర్వాత ఎవరికైనా చెప్తారనే భయంతో చిన్నారులను రవీంద్ర కుమార్ హత్య చేసినట్లుగా విచారణ లో వెల్లడైంది. రెండేళ్ల చిన్నారి మొదలుకుని 12 ఏళ్ల బాలిక వరకు రవీంద్ర కుమార్ చంపిన వారిలో ఉన్నారు. గతంలో సెమి పోర్న్ హర్రర్ సినిమాలు చూసి రవీంద్ర నాయక్.. సైకో కిల్లర్ గా మారినట్లుగా విచారణ లో వెల్లడైందని పోలీసులు తెలియజేశారు. రవీంద్ర కుమార్ కు రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించడంతో చిన్నారుల కుటుంబ సభ్యులు అతడికి మరణ శిక్ష పడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.