Begin typing your search above and press return to search.
పోలీస్ ఆఫీసర్ కొడుకు బలుపు..రేప్...దాడి
By: Tupaki Desk | 15 Sep 2018 5:55 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ పోలీస్ అధికారి కొడుకు ఓ యువతిని విచక్షణ రహితంగా కొట్టాడు. రోహిత్ తోమర్ అనే యువకుడు తన స్నేహితుడి బీపీఓకు యువతిని పిలిపించి దాడి చేశాడు. ఈ ఘటనను అతని స్నేహితుడు వీడియో తీశాడు. మహిళను కిందపడేసి కాలితో తన్నుతున్న, దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ ఘటన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆఫీస్ లో ఈ నెల 2వ తేదీన జరిగింది.ఘటనకు సంబంధించిన వీడియోలు బయటికి రావటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన రోహిత్ తండ్రి నార్కో డ్రగ్స్ విభాగంలో ఎ.ఎస్.ఐ గా పనిచేస్తున్నాడు.
ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా రోహిత్ పై కేసు నమోదు చేశారు. తనపై రోహిత్ అత్యాచారానికి ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై అత్యాచారం కేసును కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఆ దుర్మార్గుడి గురించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అదే వీడియో చూపి తనను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడంటూ రోహిత్ సన్నిహితురాలిగా పేర్కొంటున్న మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అతడిపై గురువారం తిలక్‌నగర్ పోలీసు స్టేషన్ లో....శుక్రవారం ఉత్తమ్ నగర్ పీఎస్ లో వరుసగా కేసులు నమోదైనాయి. కాగా, ఈ వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. నిందితుడు రోహిత్ తోమర్ ను గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.