Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కాంలో కీలక మలుపు... కంటతడి తర్వాత కేజ్రీ కీలక స్టెప్!

By:  Tupaki Desk   |   7 Jun 2023 1:44 PM GMT
లిక్కర్ స్కాంలో కీలక మలుపు... కంటతడి తర్వాత కేజ్రీ కీలక స్టెప్!
X
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వోగానికి గురయ్యారు. ఢిల్లీ బవానాలోని దిరియాపూర్ గ్రామంలో జరిగిన స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్స్‌‍ లెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... మనీష్ సిసోడియాను తలచుకుని కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో జరుగుతున్న పరిణామాలపైనా, సిసోడియాపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... విద్యారంగంలో విద్యాశాఖ మంత్రిగా మనీష్ సిసోడియా చేసిన సేవలను, పడిన కష్టాన్ని తలుచుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా... "సిసోడియాపై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి ఆయనను జైలులో పెట్టించింది. ఆయన మంచి పాఠశాలలు నిర్మించకుండా ఉండి ఉంటే.. ఆయనను బీజేపీ జైలులో పెట్టించేది కాదు. విద్యారంగంలో విప్లవానికి చరమగీతం పాడాలని వారు కోరుకుంటున్నారు" అని కేజ్రీవాల్ అన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేజ్రీవాల్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు! ఇప్పటికే రకరకాల మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారటాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో... ఈ విషయంపై పిటిషన్ వేయటానికి రెడీ అవుతున్నారు. అవును... శరత్ ను అప్రూవర్ గా మార్చేసి తనపై యాక్షన్ తీసుకోవటానికే ఈడీ పెద్ద కుట్రచేసిందనే వాదనతో కేజ్రీవాల్ పిటీషన్ వేయబోతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోని కీలకమైన వ్యక్తుల్లో శరత్ చంద్రా రెడ్డి ఒకరు. ఈకేసులో చాలా కాలంగా జైల్లో ఉన్న ఈయన... తాజాగా అప్రూవర్ గా మారిపోతున్నట్లు తెలిపారు. దీనికి సీబీఐ వెంటనే ఆమోదించింది. దీనికి కోర్టు కూడా అంగీకరించింది. అయితే ఉన్నపలంగా శరత్ అప్రూవర్ గా మారిపోవడం వెనక కీలకమైన రాజకీయ కుట్ర ఉందని కేజ్రీవాల్ బలంగా నమ్ముతున్నారు.

శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్ గా మారిపోవడంవల్ల సూత్రదారైన కవితను రక్షిస్తునే.. మరోవైపు కేజ్రీవాల్ ను ఇరికించే పథకానికి మార్గం సుగమం అవుతుందనే ప్రచారం తెరపైకి వస్తోంది. దీంతో... అలర్ట్ అయిన కేజ్రీవాల్... ఈ మేరకు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా... శరత్ అప్రూవర్ గా మారటాన్ని వ్యతిరేకిస్తు కోర్టులో పిటీషన్ వేయటానికి రెడీ అవుతున్నారు. దీంతో... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇది కీలక పరిణామంగా మారబోతోంది.

మరి గతకొన్ని రోజులుగా వరుసగా మారిపోతున్న రాజకీయ పరిణామాలు, దానికి అనుగుణంగా లిక్కర్ స్కాంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో... కేజ్రీవాల్ తీసుకోబోతోన్న ఈ కొత్త స్టెప్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందనేది వేచి చూడాలి!