Begin typing your search above and press return to search.
లెవెల్ పెరిగింది : ఆ సీఎం ప్రాంతీయ పెద్దన్న...?
By: Tupaki Desk | 22 May 2022 7:40 AM GMTఆయన రాజకీయం కచ్చితంగా దశాబ్ద కాలం ఉంటుంది. 2011 సమయంలో ఆయన ఉద్యమ కర్త అన్నా హజారే శిష్యుడిగా వెలుగులోకి వచ్చారు. నాడు అవినీతికి వ్యతిరేకంగా హజారే పోరాటం చేశారు. అది మధ్యతరగతిని బాగా ఆకట్టుకుంది. ఆ వేడిని సొమ్ము చేసుకున్న వారు అరవింద్ కేజ్రీవాల్. అంతే ఆ తరువాత జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపు తీరాలకు చేరువగా వచ్చేశారు.
అయితే తొలిసారి ప్రభుత్వం పెద్దగా నడవలేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి పోటీ చేస్తే పూర్తి మెజారిటీ వచ్చింది. అలా ఢిల్లీ కా రాజా గా ఆయన కొన్నేళ్ళుగా పాలిస్తున్నారు. ఇపుడు చూస్తే ఆయన చేతిలో ఒక మాదిరి పెద్ద రాష్ట్రంగా చెప్పుకునే పంజాబ్ ఉంది. ఇటీవల అక్కడ జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆప్ విజయ ఢంకా మోగించింది. పంజాబ్ లో మొత్తం 120 సీట్లు ఉన్నాయి.
అంటే దేశంలో చాలా రాష్ట్రాల కంటే అది పెద్దది అని చెప్పాలి. అందుకే 117 సీట్లు కలిగిన తెలంగాణా ముఖ్యమంత్రి ఇపుడు నేరుగా అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్తున్నారు. ఆయన ఏది చెబుతున్నా చాలా ఆసక్తిగా వింటున్నారు. ఇంకో వైపు చూస్తే కేజ్రీవాల్ కేసీయార్ కంటే పొలిటికల్ గా జూనియర్. అయినా ఇపుడు ఆయన లెవెల్ వేరేగా ఉంది.
ఒక విధంగా చెప్పాలీ అంటే ప్రాంతీయ పార్టీలకు పెద్దన్నగా మారిపోయారు. దేశంలో ప్రాంతీయ పార్టీల నేతలు పక్క రాష్ట్రంలో చూస్తే జీరోలుగానే ఉన్నారు. వారి సొంత రాష్ట్రంలో కూడా ఒకసారి గెలిస్తే మరోసారికి డౌట్ పడాల్సి వస్తోంది అలాంటిది బీజేపీకి ధీటుగా ఢిల్లీని కంచుకోటగా మార్చుకుని పంజాబ్ ని కైవశం చేసుకున్న కేజ్రీవాల్ ఉత్తరాది రాష్ట్రాలలో జరిగే ప్రతీ ఎన్నికలో పోటీ చేసి తన ఉనినికి చాటుకుంటున్నారు. సౌత్ లో కూడా ఆప్ ని మెల్లగా విస్తరిస్తున్నారు. మరి అలా కనుక ఆలోచిస్తే ఆయన చేతిలోనే ప్రాంతీయ పార్టీల రధ చక్రం ఉండే అవకాశం ఉంది.
కేజ్రీవాల్ 2014 ఎన్నికల్లోనే మోడీ మీద వారణాసిలో పోటీ చేసి తాను జాతీయ స్థాయి నేతను అని చెప్పుకున్నారు. ఇపుడు ఆయనకు కొంత అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో ఆయన ఢిల్లీని కదలి రాకపోయిన చాలా మంది ప్రాంతీయ పార్టీల నేతలు ఆయన చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ప్రభుత్వ అధికారిగా తన మార్క్ చూపించిన కేజ్రీవాల్ ఇపుడు పొలిటీషియన్ కేవలం దశాబ్ద కాలంలోనే ఎదిగిపోయారు. అందుకే ఆయన ముందు తలపండిన నాయకులు కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కేజ్రీవాల్ కి మిగిలిన నాయకులకు ఉన్న తేడా ఏంటి అంటే మధ్య తరగతి ఉన్నత స్థాయి వర్గాలు, విద్యావంతులు ఎపుడూ రాజకీయాలకు దూరంగా ఉంటారు.
వారు ఓటింగునకు కూడా అసలు ఏ కోశానా కదిలి రానే రారు. అలాంటి వారిని తమ పక్కా ఓటు బ్యాంక్ గా చేసుకున్న కేజ్రీవాల్ భారత దేశ రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అయ్యారు. అందుకే ఆయన లెవెల్ వేరు అని అంతా అనేది. బీజేపీని ఈ రోజున కొట్టడం కష్టమే కానీ ఏమైనా ఆశ ఆవేశం ఉంది అంటే అది కేజ్రీవాల్ లాంటి వారిని చూసే అని అంతా అంటారు.
మిగిలిన పొలిటీషియన్స్ కి భిన్నగా రొడ్డకొట్టుడు రొటీన్ పాలిటిక్స్ కి దూరంగా కేజ్రీవాల్ రాజకీయం సాగడమే ఆయన విజయ రహస్యం. అందుకే ఆయనను పెద్దన్నగా అంతా తప్పనిసరిగా అంగీకరించాల్సి వస్తోంది. ఆయన ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ రోజు కేసీయార్ అయినా రేపు మరో నాయకుడు అయినా కేజ్రీవాల్ వద్దకే వెళ్తున్నారు అంటే అది ఆయన రేంజి అని కూడా తప్పక ఒప్పుకోవాలేమో.