Begin typing your search above and press return to search.
మొత్తం 12.. 'మోదీ'వే 3.. రాహుల్ పై పరువు నష్టం కేసులు
By: Tupaki Desk | 27 March 2023 1:22 PM GMT"దొంగలందరి ఇంటి పేరు మోదీ"నే ఎందుకుంటుంది? అంటూ వ్యాఖ్యాలు చేసి.. కోర్టు శిక్షకు గురై.. లోక్ సభ సభ్యత్వమూ కోల్పోయారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. ఇప్పుడాయన పై కోర్టుకు అప్పీలుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకు 30 రోజుల గడువుంది. అయితే, సూరత్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చిన ఒక్క రోజులో రాహుల్ మీద చర్య తీసుకోవడం తీవ్ర సంచలనంగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీలు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సాధారణ ప్రజల్లోనూ రాహుల్ మీద సానుభూతి వ్యక్తం అవుతోంది. మెజార్టీ మీడియా కూడా రాహుల్ పక్షానే నిలుస్తున్నది. కేంద్రం తీరు అప్రజాస్వామికం అనే భావన వస్తున్నది. అసలే భారత్ జోడో యాత్రతో ప్రజల్లోకి వెళ్లిన రాహుల్ కు ఆదరణ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర చర్య తీసుకోవడం అంటే మోదీ ప్రభుత్వం తెలిసీ తప్పులో కాలేసినట్లే.
ఆ వేటుతో చర్చనీయాంశం..
రాహుల్ పై అనర్హత వేటు పడడంతో అసలు ఏమిటీ "పరువు నష్టం కేసు"లు అనేది చర్చనీయాంశంగా మారాయి. వాటి నిబంధనలు తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది. కాగా, క్రిమినల్ పరువు నష్టం చట్టాన్ని సవాలు చేస్తూ 2015లో స్వయంగా రాహుల్ సుప్రీం కోర్టు లో దావా వేయడం విశేషం. నాడు.. రాజకీయ ప్రత్యర్థులను, మీడియాను వేధించడానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్ వేయగా, దాన్ని సుప్రీం తిరస్కరించడం గమనార్హం. అయితే, ఇప్పుడు రాహులే స్వయంగా బాధితుడిగా మారారు. సూరత్ కోర్టులో ఆయన పై దాఖలైన పరువు నష్టం కేసులో న్యాయవాది కౌశల్ మోర్ వాదనలు వినిపించారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం రాహుల్‌పై దేశంలో డజనుకుపైగా క్రిమినల్ పరువు నష్టం కేసులున్నాయి.
రాహుల్ మాత్రం ఒక్క కేసూ వేయలేదు తనపైనా, కుటుంబ సభ్యులపైనా పలువురు విమర్శలు చేసినప్పటి కీ రాహుల్ మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు. 'పప్పు' అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించినా సహించారు. అయితే, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై కేసులు నమోదయ్యాయి. "దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరు ఎందుకుంది?" అన్న రాజకీయ విమర్శపైనే మైత్తం మూడు కేసులు పెట్టారు. వీటిలో సూరత్ కోర్టు మాత్రమే తీర్పునిచ్చింది. మరోటి బిహార్ మాజీ సీఎం, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ వేసినది కూడా ఉంది. కాగా 2014లో ఠాణేలో జరిగిన సభలో రాహుల్... 'గాంధీజీని ఆరెస్సెస్ వారు చంపారు" అంటూ తప్పుడు ఆరోపణ చేశారని భివాండీకి చెందిన ఆ సంస్థ నాయకుడు కేసు పెట్టారు.
రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారాల సమయంలో మోదీని ఉద్దేశించి 'కమాండర్ ఇన్ థీఫ్' అని విమర్శించారంటూ బీజేపీ నాయకుడు ఒకరు గిర్‌గాంలో కేసు పెట్టారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన రాహుల్.. "హత్య కేసులో నిందితుడైన అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. దీనిపై అహ్మదాబాద్ కోర్టులో బీజేపీ కార్పొరేటర్ ఒకరు కేసు పెట్టారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలో ప్రసంగించిన రాహుల్ "సావర్కర్ బ్రిటిషు వారిని క్షమాపణలు కోరారు" అని అన్నారు. దీనిపై సావర్కర్ మనుమడు వినాయక్ సావర్కర్, శివసేన (షిండే) నాయకుడు ఒకరు వేరువేరుగా రెండు దావాలు వేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.