Begin typing your search above and press return to search.
గెలిచిన రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్.. ఎట్టకేలకు అందజేత
By: Tupaki Desk | 19 March 2023 4:09 PM GMTపశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఎట్టకేలకు గెలిచినందుకు డిక్లరేషన్ ఫారంను అధికారులు అందజేశారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్ ఫారం అందజేశారు. రాంగోపాల్ రెడ్డి వెంట కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి, టీడీపీ నేతలు, ఉన్నారు. ఎమ్మెల్సీగా రాంగోపాల్ రెడ్డి గెలిచినట్టు అధికారులు శనివారం రాత్రే ప్రకటించినా ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించలేదు. దీనిపై టీడీపీనేతలు కార్యకర్తలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.
రాంగోపాల్ రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందించకపోవడంపై ఆగ్రహించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత తదితరులు జేఎన్.టీయూ గేటు ఎదుట భైటాయించి నిరసనకు దిగారు. కలెక్టర్ కారును అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి సహా టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్లను అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూలదోసి వైసీపీ తమ అభ్యర్థి గెలచినా ధ్రువీకరించడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
టీడీపీ నిరసనలు ఎక్కువ కావడం.. ఒత్తిడి పెరిగిపోవడంతో రాయలసీమ పశ్చిమలో టీడీపీ అభ్యర్థి గెలిచినట్టుగా ధ్రువీకరించి రాంగోపాల్ రెడ్డికి ఎట్టకేలకు కలెక్టర్ చేతులమీదుగా డిక్లరేషన్ ఫారం అందజేశారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పడింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.