Begin typing your search above and press return to search.

స్వర్గం లాంటి దేశంలో రికార్డు బ్రేక్ చావులు?

By:  Tupaki Desk   |   26 Feb 2016 5:30 PM GMT
స్వర్గం లాంటి దేశంలో రికార్డు బ్రేక్ చావులు?
X
ఆ దేశం పేరు విన్న వెంటనే.. జీవితంలో ఒక్కసారైనా ఆ దేశాన్ని చూసి రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తు. స్వర్గ సమానంగా భావించే ఆ బుజ్జి దేశమే స్విట్జర్లాండ్. చల్లటి వాతావరణంతో పాటు.. క్రమశిక్షకు అమితంగా ప్రాధాన్యత ఇచ్చే ప్రజలతో పాటు.. బాధ్యతతో ఉండే ఆ దేశానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు షాకింగ్ గా మారింది. గత ఏడాది తమ దేశంలో రికార్డు స్థాయిలో మరణాలు చోటు చేసుకున్నట్లు తాజాగా ఆ దేశం వెల్లడించింది.

బ్రహ్మాండమైన జీవన ప్రమాణాలతో పాటు.. వాతావరణ పరిస్థితులు ఉన్న స్విట్జర్లాండ్ లో ఒక్క 2015లోనే దేశవ్యాప్తంగా 67,300 మంది చనిపోయినట్లుగా రికార్డులు తేలాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్దఎత్తున మరణాలు చోటు చేసుకోలేదట. అప్పుడెప్పుడో 1918లో భారీగా మరణాలు చోటు చేసుకుంటే.. మళ్లీ 2015లోనే ఆ స్థాయిలో భారీగా మరణాలు చోటు చేసుకున్నట్లు వెల్లడించారు.

మరింత భారీగా ఆ దేశంలో మరణాలు చోటు చేసుకోవటానికి కారణాలు వెతికితే.. అధిక ఉష్ణోగ్రతలు.. 2015 ప్రారంభంలో తీవ్ర ప్రభావం చూపించే వైరస్ ఒకటి దేశంలో విరుచుకుపడిందని.. అందుకే ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకున్నట్లు తేల్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది 65 ఏళ్లు లోపు వాళ్లే కావటం గమనార్హం.