Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. కరోనా వ్యాక్సిన్‌ కు దేశంలో ఇంతమంది బలి!

By:  Tupaki Desk   |   3 April 2023 4:02 PM GMT
షాకింగ్‌.. కరోనా వ్యాక్సిన్‌ కు దేశంలో ఇంతమంది బలి!
X
2020, 2021ల్లో కోవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడించింది. పేద, ధనిక దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ కోవిడ్‌ మరణ మృదంగం మోగించింది. దీని ధాటికి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా అతలాకుతలమయ్యాయి. అయితే వ్యాక్సిన్‌ వచ్చాక మరణాలకు అడ్డుకట్ట పడినా వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలకు బలయిన వారి సంఖ్యా తక్కువేమీ కాదు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన విషయాలను వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్లు వికటించి దేశంలో ఇప్పటివరకు 1156 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాలతో తెలంగాణలో 37 మంది మరణించారని వివరించింది.

కోవిడ్‌ టీకా తీసుకున్నాక దుష్ప్రభావాలతో అత్యధికంగా కేరళలో 244 మంది మరణించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 102 మంది, ఉత్తరప్రదేశ్‌ లో 86 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్‌లో 85, కర్ణాటకలో 75, పశ్చిమ బెంగాల్‌లో 70 మంది మృతి చెందారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్‌ టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చి 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం టీకా తర్వాత ద్రుష్పభావాల కారణంగా దేశంలో ఏకంగా 92,479 మంది ఆసుప­త్రు­ల పాలయ్యారు. ఇందులో ఒక్క తెలంగాణలోనే 10,370 మంది ఆసుపత్రుల్లో చేరారని బాంబుపేల్చింది.

కోవిడ్‌ టీకా దుష్ప్రభావాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. మధ్యప్రదేశ్‌ లో 10,513 మంది కోవిడ్‌ టీకా దుష్ప్రభావాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇక మూడో స్థానంలో నిలిచిన గుజరాత్‌లో 10,127 మంది ఆస్పత్రుల్లో చేరారు.

దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే పదివేలకు పైగా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దేశంలో కరోనా టీకా వేసుకున్న ప్రతీ 23 వేల మందిలో ఒకరు ప్రతికూల ప్రభావాలతో ఆసుపత్రుల్లో చేరారని కేంద్రం తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.