Begin typing your search above and press return to search.
22 వేలు దాటిన తుర్కియే భూకంప మృతుల సంఖ్య..!
By: Tupaki Desk | 11 Feb 2023 12:00 PM GMTతుర్కియే.. సిరియా ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంప సంభవించింది. ఆ తర్వాత కూడా వరుస భూకంపాలు రావడంతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు ధ్వంసం కాగా.. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. తుర్కియేలో గత 84 ఏళ్ల కాలంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూకంపం ఇదే కావడం గమనార్హం.
సోమవారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగానే భారీ భూకంపం రావడంతో అంతా శిథిలాల కింద ఇరుక్కుపోయారు. ఈ ఘటన తర్వాత వరుస భూకంపాలు రావడంతో ప్రాణనష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. తుర్కియే.. సిరియాలో భూకంపం వచ్చిన ప్రాంతాలు శ్మశానాలను తలపిస్తున్నారు.
శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతాలు హృదయవిదారకంగా మారాయి. రోజుల గడుస్తున్న కొద్ది భూకంప మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటం శోచనీయంగా మారింది. తాజా సమాచారం మేరకు తుర్కియే.. సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య 22 వేలకు పైగా చేరింది. వేలాది మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయం చేస్తున్నా ఇంకా చాలా మంది వాటి కిందే ఉన్నారు. 101 గంటలకు శిథిలాల కింద చిక్కుక్కున్న బాధితులకు తినడానికి ఆహారం.. తాగడానికి నీరు లేక ప్రాణాలు కాపాడుకునేందుకు అల్లాడుతున్నారు. అద్మాన్ మహమ్మద్ అనే వ్యక్తి 17 ఏళ్ల యువకుడు దాహర్తి తాళలేక తన మూత్రం తాగి ప్రాణాలతో బయటపడ్డాడు.
తీవ్రమైన చలిగాలుల వణికిస్తున్నా ఎటు కదలేని స్థితిలో చాలామంది మృత్యువుతో పోరాడుతున్నారు. వీరిలో కొందరు మృత్యుంజయులుగా బయటపడుతున్నారు. నాలుగు రోజుల శిథిలాల కింద చిక్కుకున్న అద్మాన్ మహమ్మద్ ను రెస్యూ టీం కాపాడింది. అతడు ప్రాణాలతో బయటపడిన తర్వాత తల్లిదండ్రులను హత్తుకొని బోరున విలపించాడు.
అలాగే అదియామన్ అనే చోట నాలుగేళ్ల చిన్నారి 105 గంటలపాటు శిథిలాల కింద ఇరుక్కుపోయిన ప్రాణాలతో బయట పడింది. ఈ చిన్నారిని తల్లి వద్దకు చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తుందన్నారు. ఇస్కెందరన్ ప్రాంతంలో శిథిలాల కింద ఇరుక్కుపోయిన తొమ్మిది మందిలో ఆరుగురిని ప్రాణాలతో కాపాడారు. కిరిఖాన్లో 50 గంటల తర్వాత ఓ మహిళను జర్మనీ బృందం కాపాడింది.
మరోచోట ఇద్దరు అక్కాచెల్లెళ్లను రిస్క్యూ సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద ఇరుక్కున్న 20ఏళ్ల విద్యార్థిని వాట్పాప్ కాపాడింది. తుర్కియేలో ఓ అపార్ట్ మెంట్లో ఇరుక్కున్న విద్యార్థి సమయస్ఫూర్తితో తాను ఉన్న ప్రాంతాన్ని స్నేహితులకు వాట్సాప్ లో షేర్ చేశాడు. దీంతో వారు అక్కడికి చేరుకొని శిథిలాల కింద ఇరుక్కున్న విద్యార్థిని కాపాడారు.
ఇదిలా ఉంటే తల్లి బొడ్డు ఊడకుండా పుట్టిన ఓ చిన్నారిని సహాయ బృందం కాపాడారు. ఈ చిన్నారి కుటుంబం మొత్తం చనిపోగా ఆస్పత్రిలో ఆ పాపకు ఓ వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఆ పాపకు మాయ అని పేరు పెట్టారు. మాయ అంటే అద్భుతం అని అర్థం. ఈ పాపకు వైద్యుడి భార్య మానవత్వంలో పాలు పట్టిస్తోంది.
అయితే సమయం గడిచే కొద్ది శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని ప్రాణాలతో కాపాడటం కష్టంగా మారనుంది. గరిష్టంగా వారం వరకు మాత్రమే ప్రాణాలతో కాపాడే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు సహాయ బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. తుర్కియే భూకంప బాధితులకు భారత్ అన్ని విధాలా సాయం అందిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.