Begin typing your search above and press return to search.

అకౌంట్ లో డబ్బు కోసం బ్యాంకుకు ‘మృతుడు' .. వణికిపోయిన సిబ్బంది !

By:  Tupaki Desk   |   6 Jan 2021 9:30 AM GMT
అకౌంట్ లో డబ్బు కోసం బ్యాంకుకు ‘మృతుడు .. వణికిపోయిన సిబ్బంది !
X
బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. బ్యాంకు లో తన అకౌంట్ లో ఉండే డబ్బు కోసం ఏకంగా మృతుడే బ్యాంకు లోపలి రావడంతో , ఆ బ్యాంకు సిబ్బంది హడలిపోయారు. అసలు బ్యాంకు లో డబ్బు కోసం మృతుడు రావడం ఏంటి అనుకుంటున్నారా !పూర్తి వివరాల్లోకి వెళ్తే ... రాజధాని పట్నా సమీపంలోని షాజహాన్‌ పూర్ పరిధిలో సిగరియావా గ్రామంలో కెనరా బ్యాంకు బ్రాంచ్ ఉంది. అదే గ్రామానికి చెందిన మహేష్ యాదవ్ ‌ కు ఆ బ్యాంకులో ఖాతా ఉండగా.. అతడు అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి అంత్యక్రియల నిర్వహణకు డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లి ఖాతాలోని డబ్బులు కావాలని అక్కడి సిబ్బందిని అడిగారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు.

దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. మహేష్ యాదవ్ మృతదేహాన్ని నేరుగా బ్యాంకుకు తీసుకొచ్చారు. ఊహించని ఈ పరిణామానికి బ్యాంకు సిబ్బంది షాక్ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు మహేష్ మృతదేహంతో బ్యాంకులోనే బైఠాయించారు. బ్యాంకు మేనేజర్ వారికి ఎంత నచ్చజెప్పినా వినిలేదు. చివరకు చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరు తన సొంత డబ్బులు రూ. 10 వేలు ఇచ్చి గ్రామస్తులను అక్కడ నుంచి పంపేశారు.

అక్కడ నుంచి వెళ్లిపోయిన గ్రామస్తులు ఆ సొమ్ముతో మహేష్ యాదవ్‌ కి అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్‌ అవివాహితుడు కాగా, అతడికి కుటుంబసభ్యులు, బంధువులెవరూ లేరు. అయితే, అతడి బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలకుపైగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి నామినీ ఎవరూ లేకపోవడంతోనే ఖాతాలోని సొమ్మును ఇవ్వడానికి బ్యాంకు మేనేజర్ నిరాకరించారు.