Begin typing your search above and press return to search.

ఆయనకెవ్వరూ అవార్డు ఇవ్వలేదు.. ఆయనే ఇచ్చేసుకున్నారు..!

By:  Tupaki Desk   |   31 Dec 2020 5:30 PM GMT
ఆయనకెవ్వరూ అవార్డు ఇవ్వలేదు.. ఆయనే ఇచ్చేసుకున్నారు..!
X
‘డేవిడ్​ వార్నర్​’ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన ఆటగాడు. నిజానికి వార్నర్ ఆస్ట్రేలియా ఆటగాడు. అతడికి సొంత దేశంలో ఫ్యాన్స్​ ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ తెలుగురాష్ట్రాల్లో మాత్రం లక్షలమంది ఉన్నారు. అందుకు కారణం వార్నర్​ ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ కు నేతృత్వం వహిస్తుంటాడు. అందుకే అతడికి అంతమంది ఫ్యాన్స్. ఐపీఎల్​ సీజన్​ టైంలో వార్నర్​ పేరుతో సోషల్​మీడియాలో ఫుల్​ హాడావుడి కనిపిస్తూ ఉంటుంది.

అతడి పేరిట ఫేస్​బుక్​ గ్రూప్​లు వెలుస్తాయి.. ఫేస్​బుక్​ పేజెస్​ ఉంటాయి. మీమ్స్​ తయారు చేస్తుంటారు. ఆ టైంలో ఫ్యాన్స్​ గోల మాములుగా ఉండదు. ఇకపోతే వార్నర్​ కూడా టిక్​టాక్​ వీడియోలతో తన అభిమానులను తెగ ఖుషీ చేస్తుంటాడు. ఈ ఏడాది తెలుగులో సూపర్​హిట్​గా నిలిచిన బుట్టబొమ్మ, మైండ్​ బ్లాక్​ వంటి పాటలతో ఫ్యాన్స్​ను అలరించాడు వార్నర్​. ఆ వీడియోలో వార్నర్​తో పాటు అతడి భార్య, పిల్లలు కూడా డాన్స్​ చేశారు. అయితే ఈ వీడియోకు వచ్చిన లైక్స్​, వ్యూస్​ చూస్తే వార్నర్​కు ఎంత క్రేజ్​ ఉందో మనకు అర్థమవుతుంది. అయితే ఇటీవలే ఐసీసీ 2011-20 దశాబ్దానికి వివిధ ఫార్మాట్లలో ఉత్తమ క్రికెటర్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆటగాళ్లకు పురస్కారాలు కూడా అందజేసింది.

విరాట్ కోహ్లీనే మేల్ క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్‌గా నిలిచాడు. అలాగే ఈ దశాబ్దానికి ఉత్తమ వన్డే ఆటగాడిగానూ పురస్కారం అందుకున్నాడు. అలాగే మూడు ఫార్మాట్లకు ఐసీసీ ఎంపిక చేసిన దశాబ్దపు జట్లలో చోటు దక్కించుకోవడమే కాక.. టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ధోనీ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వార్నర్ విషయానికొస్తే అతను ఐసీసీ దశాబ్దపు వన్డే, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయం పక్కకు పెడితే ఇప్పుడు వార్నర్​ ఇన్​స్టాలో పెట్టిన ఓ పోస్ట్​ తెగ వైరల్​ అవుతంది. ‘ఐసీసీ మేల్ టిక్ టాకర్‌ ఆఫ్ ద డెకేడ్’ అంటూ తనకు తానే అవార్డు ఇచ్చుకున్నట్టు ఆ ఫోటోను వార్నర్​ ఇన్​స్టాలో షేర్​ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం తెగ వైరల్​ అవుతుంది. ‘వార్నర్​ నిజమే నువ్వే ఈ డికేడ్​కు టిక్​టాక్​ స్టార్​వి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు తెలుగు అభిమానులు.