Begin typing your search above and press return to search.

జీవిత పాఠం నేర్పాలని.. ఈ ఫారినర్ చచ్చి బతికాడు

By:  Tupaki Desk   |   17 Jun 2023 9:00 AM GMT
జీవిత పాఠం నేర్పాలని.. ఈ ఫారినర్ చచ్చి బతికాడు
X
ఒక బెల్జియన్ వ్యక్తి తన కుటుంబానికి గుణపాఠం చెప్పేందుకు ఒక విచిత్రమైన పనికి పూనుకున్నాడు. తన మరణాన్ని తానే నకిలీ చేసుకున్నాడు. ఆపై హెలికాప్టర్‌ లో తన అంత్యక్రియలకు హాజరయ్యాడు. అదేంటి అనుకుంటున్నారు.. దాని కథేంటో చూద్దాం.

బెల్జియన్ కు చెందిన డేవిడ్ బేర్టెన్ వయసు 45 సంవత్సరాలు. అయితే అతను అందరూ ఉన్నా ఒంటరితనం గడుపుతున్నాడు. బంధువులు అతన్ని తక్కువగా చూస్తున్నారని బుద్ధి చెప్పేందుకు ఓ ఫథకం వేశాడు. తాను మ‌ర‌ణించాన‌ని క‌ట్టు క‌థ అల్లాడు. ఆపై త‌న అంత్య‌క్రియ‌ల‌కు బంధువులంతా త‌ర‌లిరాగా వారి స‌మ‌క్షంలో హెలికాఫ్ట‌ర్‌ లో అక్క‌డ‌కు చేరుకున్నాడు.

ఒక‌రితో ఒక‌రు ఆప్యాయ‌త‌లు పంచుకుంటూ మెల‌గాల‌ని బంధువుల‌కు గుణ‌పాఠం చెప్పేందుకే డేవిడ్ ఇలా చేశాడని తెలుస్తోంది. హెలికాఫ్ట‌ర్ పొలంలో ల్యాండ్ అవ‌గా డేవిడ్ బంధువులు అత‌డిని చుట్టుముట్టి హ‌గ్ చేసుకునే వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఫ్రాంక్‌ ను చేసేందుకు డేవిడ్‌ కు అత‌డి కూతుళ్లు కూడా స‌హ‌క‌రించారు.

లీగె ప్రాంతంలో అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేసే ముందు వారు బంధువుల‌కు సంతాప సందేశాలు పంపారు. నీ ఆత్మ శాంతించాలి నాన్నా…నీ గురించి మేం త‌ల‌చుకోని క్ష‌ణ‌మంటూ ఉండ‌ద‌ని ఈ సందేశంలో డేవిడ్ కుమార్తె రాసుకొచ్చారు.జీవితం ఇంత అన్యాయం చేస్తుందా..? నువ్వు తాత కావాలి..జీవితాన్ని నిండుగా ఆస్వాదించాల్సి ఉండ‌గా ఇలా ఎందుకు జ‌రిగింద‌ని ఈ స్టోరీని డేవిడ్ కూతురు మరింత లెవెల్ కు తీసుకువెళ్లింది.

డేవిడ్ మ‌ర‌ణ వార్త విని పెద్ద‌సంఖ్య‌లో బంధువులు అక్క‌డికి వచ్చారు. కాసేపట్లో అంత్యక్రియలు జరుగుతాయని అనగా.. అత‌డు స‌జీవంగా ఉన్నాడ‌ని తెలిసి సంతోషించారు. హెలికాఫ్ట‌ర్ నుంచి డేవిడ్ బ‌య‌ట కాలుమోప‌గా వారంతా అత‌డిని స్వాగ‌తించారు. హగ్ చేసుకుని ఏడ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టైమ్స్ ఆఫ్ లండన్‌తో బెర్టెన్‌ మాట్లాడుతూ తాను ఎప్పుడూ దేనికీ ఆహ్వానించబడలేదని.. తనను ఎవరూ చూడరని.. అందుకే ఇలా చేసినట్లు చెప్పారు. వారికి జీవిత పాఠం చెప్పాలనుకున్నానన్నారు., వారిని కలవడానికి ఎవరైనా చనిపోయే వరకు మీరు వేచి ఉండకూడదని వారికి చూపించాలనుకుంటున్నాను".అని బెర్టెన్ తెలిపాడు. తాను అనుకున్నది సాధించాడు. కుటుంబ సభ్యులను ఒక్కటి చేసి తాను కలిసిపోయాడు.