Begin typing your search above and press return to search.
కూతురి లవ్ లెటర్.. 15 ఏళ్ల పాటు కోర్టులో కేసు
By: Tupaki Desk | 1 Jun 2023 6:44 PM GMTఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్ల పోరాటం.. కూతురికి ప్రేమలేఖ.. ఆ తల్లికి పోరాటపథంగా మారింది. కూతురిని ప్రేమించిన యువకుడిపై పోరాటం చేసేలా చేసింది. ఆ అలుపెరగని కన్నతల్లి పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కూతురికి ప్రేమ లేఖ రాసిన అప్పటి బాలుడు.. ఇప్పటి యువకుడికి శిక్ష పడింది.
టీనేజీలో లవ్ లెటర్స్ రాయడం కామనే. స్కూల్, కాలేజీ రోజుల్లో చాలా మంది ఆ అనుభవాలను కూడా ఎదుర్కునే ఉంటారు. అయితే ఇక్కడ టీనేజీలో లవ్ లెటర్ రాసిన పాపానికి ఓ వ్యక్తికి ఏడాది పాటు శిక్ష పడింది.
తన కూతురికి లవ్ లెటర్ రాశాడని, అతన్ని శిక్షించాలని ఓ మహిళ న్యాయం పోరాటం చేసింది. శిక్ష పడేదాకా వదిలిపెట్టలేదు. ఎంత మంది జడ్జీలు మారినా ఆమె న్యాయపోరాటం మాత్రం 15 సంవత్సరాలు సాగింది.
ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో 2008లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ మరో మైనర్ బాలికకు లవ్ లెటర్ రాశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన కుమార్తెకు అశ్లీల రీతిలో ఉత్తరం రాయడమే కాకుండా మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మైనర్ బాలునిపై కేసు నమోదు చేశారు. కోర్టుకు బదిలీ చేశారు.
15 సంవత్సరాలుగా కేసు నడుస్తూనే ఉంది. ఎంతో మంది జడ్జీలు మారారు. 2008 నుండి 2023 వరకు 80 వాయిదాలతో కేసు నడిచింది. దాదాపు 10 మంది జడ్జీలు మారారు. అయితే ఓ ఉన్నతాధికారి ఈ కేసులో చొరవ చూపారు.
సుదీర్ఘ కాలంగా కేసు నడుస్తున్నందున, అమ్మాయి, అబ్బాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు త్వరగా పరిష్కరించాలని జడ్జీకి విన్నవించారు. ఎట్టకేలకు ఆ బాలుడికి(ఇప్పుడు యువకుడు) శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. రూ.3 వేల జరిమానా విధించారు.
లవ్ లెటర్ గురించి నిందితున్ని జడ్జీ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అతను జడ్జి ముందు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను లవ్ లెటర్ రాసిన విషయం నిజమేనని చెప్పాడు. అయితే తాను ఈ కేసును ఎదుర్కొనలేనని, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయనని జడ్జీకి విన్నవించాడు. అతని సత్ప్రవర్తనను గుర్తిచిన జడ్జి ఏడాది పాటు పరిశీలన(ప్రొబెషన్) శిక్ష విధించారు. అంటే ఆ యువకుడు ఏడాది పాటు ప్రాసిక్యూటింగ్ అధికారి పరిశీలనలో ఉండవలసి ఉంటుంది.