Begin typing your search above and press return to search.
థర్డ్ జెండర్లకూ ఓ మ్యాట్రీమోనీ..!
By: Tupaki Desk | 23 Dec 2020 4:47 PM GMTవాళ్లను చూస్తే వెక్కిరింపులు.. వెకిలిచేష్టలు. దగ్గరికొస్తే చీదరింపులు.. చీత్కారాలు. అసలు వాళ్లను మనుషులుగానే చూడదు మెజారిటీ సమాజం. కానీ.. వాళ్లూ అందరిలాంటి మనుషులే. వారికీ ఓ మనసు ఉంటుంది అని గుర్తించాడు ఓ వ్యక్తి. ఆ మనసు కోరుకునే ఓ తోడును అందించాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం.. ఇప్పుడు వారికీ ఓ మ్యాట్రిమొనీ అందుబాటులోకి వచ్చింది. అవును.. థర్డ్ జెండర్లు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ అందుబాటులో ఉంది.
ముంబయి వాసి ఏర్పాటు..
ముంబయికి చెందిన సిర్జీష్ ఈ యాప్ ను ప్రారంభించారు. ‘ఉమీద్ మ్యాట్రిమోనీ’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్.. ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యింది. దీనిని ఏడాది క్రితం ప్రారంభించారు. సమాజంలో ఎంతో నిర్లక్ష్యానికి, చీదరింపులకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకు ఒక మాట్రిమోనీ ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా వారికి వివాహ సంబంధాలను కుదర్చుతున్నారు.
ఏజెన్సీలు ఉన్నా..
ట్రాన్స్‌జెండర్లకు వివాహ సంబంధాలు తెచ్చేందుకు ఏజన్సీలు ఉన్నాయి. కానీ, ఇవి వీళ్ల నుంచి ఎక్కువ మొత్తాల్లో డబ్బులు దండుకుంటున్నాయి. అందుకే ‘ఉమీద్ మాట్రిమోనీ’ యాప్ రూపుదిద్దుకుంది. మనదేశంలోని ఎల్‌జిబిటి (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీ అందరికీ ఈ యాప్ సేవలు అందిస్తోంది.
8 వేల మంది..
ఒక్క సంవత్సరంలో ఎల్‌జిబిటి కమ్యూనిటీకి చెందిన ఎనిమిది వేల మంది ఇందులో తమ పేర్లను నమోదుచేసుకున్నారు. తమ జీవితభాగస్వామిని పొందడం కోసం వీళ్లంతా ఈ యాప్ ద్వారా వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. దీని సృష్టికర్త సిర్జీష్ యాప్ ప్రారంభించడానికి ముందు నుంచే ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీ సంక్షేమం కోసం వన్య ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు.
విదేశాలకు చెందినవారూ..
ఈ యాప్‌ను ప్రారంభించడానికి ముందు ఈ కమ్యూనిటీ ప్రజల డేటాను సిర్జీష్ సేకరించారు. ఆ తరువాత ఉమీద్ మాట్రిమోనీ యాప్ ప్రారంభించారు. ఈ యాప్ లాంచ్‌కి ముందే ఎల్‌జిబిటీకి చెందిన 500 మంది ఇందులో చేరారు. మన దేశానికి చెందిన వారు మాత్రమే కాదు.. థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, ఫిలిప్పైన్స్, మరికొన్ని విదేశాలలోని ఎల్‌జిబిటీ యువత కూడా ఇందులో చేరారు. అయితే.. వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ.. యాప్‌లో తమ ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి చాలామంది సంశయిస్తున్నారు.
వివాహాలకు మాత్రమే..
తాను రూపొందించిన ‘ఉమీద్ మాట్రిమోనీ’ యాప్ గురించి సిర్జీష్ మాట్లాడుతూ.. ‘ఇది డేటింగ్ యాప్ కాదు ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ తమకు నచ్చిన భాగస్వాములతో బలమైన జీవిత బంధాన్ని కొనసాగించడానికి ప్రారంభించాం’ అని వివరించారు.
కొంత సమయం తప్పదు..
ఇతర దేశాలతో పోలిస్తే.. మన దగ్గర ట్రాన్స్ జెండర్లు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాజిక భయాందోళనల నుంచి వీళ్లు బయటపడి, వివాహ బంధంలోకి ధైర్యంగా అడుగు పెట్టడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. మనదేశంలో చట్టం కింద సాధారణ జంటలు అనుభవిస్తున్న ప్రయోజనాలేవీ ఎల్‌జిబిటి జంటలకు ఉండడం లేదు. ఫలితంగా వీళ్లు రాజ్యాంగపరమైన ఎన్నో హక్కులను కోల్పోతున్నారు. ఒకే జెండర్ వాళ్లు పెళ్లి చేసుకోవడం మనదేశంలో నేరం కాకపోయినా వీళ్ల పెళ్లిళ్లను అధికారికంగా మనదేశంలో ఇంకా రిజిస్టర్ చేయడం లేదు. అంతేకాదు వీరిని ఆదుకునే ఎలాంటి అధికారిక డాక్యుమెంట్లు కూడా లేవు. అయితే.. తమ హక్కుల సాధన కోసం ఎందరో ఎల్‌జిబిటీ కార్యకర్తలు దేశమంతటా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు.
ఈ యాప్ తో చైతన్యం..
ఇప్పుడిప్పుడే ట్రాన్స్ జెండర్లు కొద్దికొద్దిగా ధైర్యం కూడగట్టుకుంటున్నారు. అలాంటి వారికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ యాప్ వల్ల తగిన జీవిత భాగస్వామిని ఎంచుకుని ఆనందంగా జీవితం గడుపుతున్నామని పలువురు ఎల్‌జిబిటి జంటలు చెబుతున్నాయి.
వన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
ఎల్‌జిబిటీ కమ్యూనిటీ వారి కోసం సామాజిక, సాంస్కృతిక, విద్యాపరమైన పలు కార్యక్రమాలను చేపడుతోంది వన్య ఫౌండేషన్. ఈ సంస్థ ‘ఉమీద్ మాట్రిమోనీ’ యాప్ ద్వారా ఎల్‌జిబిటి కుటుంబాలను ఏర్పరచడంలోనూ కీలకంగా కృషిచేస్తోంది. వీరందరికీ విద్యావకాశాలు కల్పించడంతో పాటు ఉపాధిని సైతం ఈ సంస్థ కల్పిస్తోంది.
ఖచ్చితంగా ఊరటే..
ఈ మ్యాట్రిమొనీ యాప్.. ఖచ్చితంగా థర్డ్ జెండర్లకు ఊరటే. కన్నవాళ్లు వెళ్లగొడితే.. చుట్టుపక్కల వాళ్లు చీదరిస్తే.. ఎవరూ పని ఇవ్వకపోతే.. ఎక్కడ ఉండాలో తెలియక.. ఏం తినాలో అర్థం కాక.. వాళ్లు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అలాంటి వారికి ఓ తోడు అందించేందుకు ‘ఉమీద్ మాట్రిమోనీ‘ చేస్తున్న ప్రయత్నాన్ని తప్పక అభినందించాల్సిందే. ప్రోత్సాహం అందించాల్సిందే.