Begin typing your search above and press return to search.

ఒకే సమయంలో 35మందితో ఆ పని..ట్విస్ట్ ఇదే

By:  Tupaki Desk   |   24 April 2021 7:30 AM GMT
ఒకే సమయంలో 35మందితో ఆ పని..ట్విస్ట్ ఇదే
X
ఒక్క లవర్ ను /భార్యను మెయింటేనే చేయడానికి మగ పుంగవులు అంతా జుట్టూ పీక్కుంటుంటే.. వీడి బండబడా ఏకంగా 35 మందితో ఒకే సమయంలో ప్రేమాయణం సాగించాడు. మాటలతో ముగ్గులోకి దించాడు. అతడు అంతమందితో ఒకేసారి ఎలా డేటింగ్ చేశాడన్నదే ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.

జపాన్ లోని కాన్సాయి ప్రాంతానికి చెందిన మిమాగావా అనే వ్యక్తి వృత్తిరీత్యా సేల్స్ మేన్ గా పనిచేస్తున్నాడు. 35 మంది మహిళలను ప్రేమ పేరుతోతో నమ్మించి మాయమాటలు చెప్పి బుట్టలో వేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

ముఖ్యంగా వృద్ధ, ఒంటరి మహిళలను అతడు లక్ష్యంగా చేసుకొని పెళ్లి పేరుతో వారిని ఏమర్చాడు. ఏకకాలంలో 35 మందితో డేటింగ్ కూడా చేశాడు. తన బర్త్ డే ను ఒక్కొక్కరికి ఒక్కో తేదీని చెప్పి ఏడాది పొడువునా వారి నుంచి ఖరీదైన బహుమతులు పొందాడు.

ఇలా భారత కరెన్సీలో దాదాపు 70వేల రూపాయిలు విలువ చేసే బహుమతులు అందుకున్నాడు. తాను పనిచేసే కంపెనీలోనే వస్తువులను వారి చేత కొనిపించాడు. అక్కడే వారిని కలిసేవాడు. ఇంతమందితో డేటింగ్ విషయం వారికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

అయితే మియాగావా తమను మోసం చేస్తున్న విషయాన్ని కొందరు పసిగట్టారు. వెంటనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించి మియాగావాను అరెస్ట్ చేశారు. బహుమతుల కోసం ఉద్యోగంలో టార్గెట్ చేరుకోవడం కోసం ప్రేమాయణం ఆడినట్లు ఒప్పుకున్నాడు. డబ్బు, బహుమతుల కోసమే ఇలా 35మంది మహిళలతో డేటింగ్ చేసినట్టు తెలిసింది. ఇతడి నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతమందిని ఎలా మెయింటేన్ చేశావ్ సామీ అని కామెంట్ చేస్తున్నారు.