Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ పంపిణీకి డేట్ ఫిక్స్.. సంక్రాంతి థమాకా అనుకోవాలా?
By: Tupaki Desk | 6 Jan 2021 3:55 AM GMTదేశీయంగా రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించటం.. వ్యాక్సినేషన్ కార్యక్రమం షురూ చేయటానికి కేంద్రం ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ నెల 13 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీని షురూ చేయనున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవటానికి వీలుగా యాప్ ను తీసుకొస్తోంది కేంద్ర సర్కారు. వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఈ యాప్ లో పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సంక్రాంతికి ఒక రోజు ముందుగా మొదలు కానున్న ఈ వ్యాక్సిన్ ను పక్కా ప్లాన్ ప్రకారం అందించనున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవటంతో పాటు.. గుర్తింపు పత్రాలు సైతం చాలా అవసరమని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. అయితే.. తొలుత వ్యాక్సిన్ అందించే ఫ్రంట్ లైన్ వారియర్లకు మాత్రం రిజిస్ట్రేషన్ల అవసరం లేదంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే వారి సమాచారం అప్ లోడ్ అయినందు వల్ల ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు.
యూనిక్ హెల్త్ ఐడెంటిటీని రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే.. వారిని గుర్తించటం సులభమవుతుందని చెబుతున్నారు. ఇక.. రాష్ట్రాల వారీగా.. జిల్లాల వారీగా టీకాలు వేసే కార్యక్రమం ఎప్పటి నుంచి అన్న విషయాన్ని కలెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి తెలుగు వారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి ఒకరోజు ముందుగా టీకా వేసే కార్యక్రమం మొదలవుతుందని చెప్పక తప్పదు.