Begin typing your search above and press return to search.
ఫ్లైట్ ఎక్కకుండా ఆపేసి మరీ వివేకా హత్య...దస్తగిరి నోటి వెంట సంచలనాలు!
By: Tupaki Desk | 18 April 2023 8:48 PM GMTవైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న దారుణ హత్యకు గురి అయ్యారు. నిజానికి ఆయన 15న హైదరాబాద్ లో ఉండాల్సింది. దాని కోసం 14న మధ్యాహ్నం ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నారు. కడప ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కి ఆయన రావాల్సి ఉంది. దాన్ని ఆయన తన సన్నిహితుడు అయిన ఎర్ర గంగిరెడ్డికి చెప్పారు.
అయితే ఎర్ర గంగిరెడ్డి మాత్రం హైదరాబాద్ టూర్ ని ఆపుకోమని 14 రాత్రి ముఖ్య విషయాలు మాట్లాడుకోవాలని చెప్పడంతో సరేనని వివేకా హైదరాబాద్ ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారట. ఒక చానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివేకా హత్య కేసులో ఏ 4 నిందితుడు, అప్రూవర్ అయిన షేక్ దస్తరిగి ఆ రోజు ఏమి జరిగింది అన్న దాని మీద సంచలన విషయాలు బయటపెట్టారు.
నిజానికి వైఎస్ వివేకాన్ హత్యకు ఫిబ్రవరిలోనే స్కెచ్ గీశారని దస్తరిగి వెల్లడించడం విశేషం. అయితే సరైన టైం కోసం చూడడంతో నెల రోజుల తరువాత మార్చి 15న అది వర్కౌట్ అయిందని దస్తగిరి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ హత్య కోసం ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో పలు దఫాలుగా సమావేశాలు జరిగాయని. ఈ హత్యలో ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, తాను పాల్గొన్నామని ఆయన పేర్కొన్నారు
హత్యకు ఆరు నెలల ముందే వివేకా కారు డ్రైవర్ గా తాను తప్పుకున్నానని దస్తగిరి చెప్పారు. తాను కేవలం డబ్బుకు ఆశపడే హత్య చేశానని అంటున్నాడు. ఈ హత్యకు నలభై కోట్ల డీల్ ఉందని, హత్యలో పాల్గొన్న నలుగురికీ తలా పది కోట్లు వంతున ఇవ్వడానికే ఒప్పందమని ముందుగా అయిదు కోట్లు ఇవ్వడానికి కూడా డీల్ కుదిరిందని, అలా తనకు కోటి రూపాయలను సునీల్ యాదవ్ ద్వారా అందించారని దస్తగిరి చెప్పాడు.
ఇక మార్చి 14న తాను కదిరి వెళ్ళి గొడ్డలి కొనుగోలు చేసుకుని వచ్చానని, మొదట సూది మందుతోనే చంపాలనుకున్నా తరువాత గొడ్డలితో హత్య చేయాలని ప్లాన్ మార్చారని దస్తగిరి ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక 14 రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తాను సునీల్ యాదవ్ వివేక ఇంటికి ముప్పై మీటర్ల దూరంలో ఒక తోట వద్ద మందు తాగుతూ ఆయన కోసం ఎదురు చూశామని ఆయన రాత్రి పదకొండున్నర ప్రాంతంలో వచ్చారని , ఆ సంగతిని తాము ఉమా శంకర్ రెడ్డి కి ఫోన్ ద్వారా చెప్పామని దస్తరిగి చెప్పాడు.
ఆ తరువాత ఎర్ర గంగిరెడ్డి ఉమా శంకర్ రెడ్డి వివేకా ఇంటికి వచ్చారని, ముందు ఎర్ర గంగిరెడ్డి వివేకా ఇంటికి వెళ్తే తాము ముగ్గురం వెనక డోర్ వైపు గోడ దూకి వెళ్లామని దస్తగిరి చెప్పాడు. వివేకా హత్యకు ముందు ఆయనతో మాట్లాడాలని తామంతా ఆయన బెడ్ రూం లోకి వెళ్లామని బెంగుళూరు ల్యాండ్ ఇష్యూ విషయాన్ని కావాలనే ప్రస్తావించి వివేకాతో గొడవపడినట్లుగా చెప్పాడు.
మొదట వివేకాను కొట్టింది సునీల్ యాదవ్ అని ఆ తరువాత గొడ్డలితో ఉమా శంకర్ రెడ్డి దాడి చేశారని, ఆయన్ని బాత్ రూం దాకా తీసుకెళ్ళి హత్య చేశామని దస్తగిరి కళ్లకు కట్టినట్లుగా హత్య సంగతి ఆ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇక ల్యాండ్ ఇష్యూ సందర్భంగా తన దగ్గర డబ్బులు లేవని, తొందరలో తాను ఎంపీని కాబోతున్నానని, ఆ మీదట డబ్బులు తన దగ్గర ఉంటాయని దాంతో తాను అందరికీ న్యాయం చేస్తాను అని వివేకా చెప్పారని దస్తగిరి చెప్పడం విశేషం.
అంటే కడప ఎంపీ సీటుని వివేకా ఆశించారు అన్నది దస్తగిరి మాటల ద్వారా అర్ధం అయింది అంటున్నారు. ఇక దస్తరిగి మరో మాట చెప్పాడు. కడపకు అవినాష్ ఎంపీ అయినా ప్రజల దృష్టిలో ఎంపీ మాత్రం వివేకానే అని అన్నాడు. వివేకా మీద తనకు కోపం లేదని, ఆయన మంచి వాడని, అయితే డబ్బుకు ఆశపడడడంతో పాటు మందు తాగి హత్య చేశామని దస్తగిరి తన బాధను వ్యక్తం చేయడం విశేషం.
తాను చేసిన పాపాని కడిగేసుకోవడానికే అప్రూవర్ గా మారాను తప్ప ఇందులో ఎవరి వత్తిడీ లేదని స్పష్టం చేశాడు. ఈ కేసులో సత్యమే గెలుస్తుందని, పులివెందుల ప్రజలందరికీ వివేకాను ఎవరు చంపారో తెలుసు అని దస్తగిరి అనడం విశేషం. ఈ కేసులో సీబీఐ విచారణ ముగింపుకు వచ్చిందని, మేము పాత్రధారులం అరెస్ట్ అయ్యామని, ఇపుడు సూత్రధారులు అరెస్ట్ అవుతారని దస్తగిరి చెప్పడం చూస్తూంటే సంచలనాలే ముందు ముందు నమోదు అయ్యేలా ఉన్నాయని అంటున్నారు.