Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో ప్రమాదకర స్టెరాయిడ్స్ పట్టివేత.. జిమ్‌ చేసే యువకులే టార్గెట్‌

By:  Tupaki Desk   |   4 March 2023 6:00 AM GMT
హైదరాబాద్‌ లో ప్రమాదకర స్టెరాయిడ్స్ పట్టివేత.. జిమ్‌ చేసే యువకులే టార్గెట్‌
X
తక్కువ సమయంలో మంచి ఫిజిక్ రావాలని.. సిక్స్ ప్యాక్ బాడీ సాధించాలని కోరుకునే యువకులు టార్గెట్ గా స్టెరాయిడ్స్ ను సప్లై చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. దేశంలో మరెక్కడో కాదు.. హైదరాబాద్‌ లో ఈ స్టెరాయిడ్స్ యొక్క ముఠా గుట్టు రట్టు అవ్వడం సంచలనంగా మారింది.

హైదరాబాద్‌ లో పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ ను సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించి మొత్తం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేయడం జరిగింది. స్టెరాయిడ్‌ ఇంజక్షన్లను ఉపయోగించడం వల్ల వెంటనే ఎలాంటి ఇబ్బంది లేకున్నా భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర పరిణామాలు చూపిస్తాయి.

తక్కువ సమయంలో బరువు పెరగడం లేదా సిక్స్ ప్యాక్ బాడీ పొందడం అనేది కచ్చితంగా మంచిది కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. అయినా కూడా కొందరు యువకులు తమ యొక్క ఫిజిక్‌ ను పెంచుకోవడం కోసం మరియు సిక్స్ ప్యాక్‌ లో తమ బాడీని చూపించుకోవడం కోసం రిస్క్ తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌ లో గత కొంత కాలంగా స్టెరాయిడ్స్ ను సరఫరా చేస్తున్న ముఠా ను పోలీసులు గుర్తించి వారి నుండి 180 స్టెరాయిడ్‌ ఇంజక్షన్లు మరియు 1100 మాత్రలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముఠా సభ్యులుగా ఓం ప్రకాష్‌.. సరోదే నరేష్‌.. సయ్యద్‌ ఫరూక్ లుగా గుర్తించారు.

ఇప్పటికే స్టెరాయిడ్స్ వాడిన వారి వివరాలను సేకరించడం తో పాటు ఈ స్టెరాయిడ్స్ ను ఎక్కడ నుండి తెప్పిస్తున్నారు.. ఎలా మార్కెట్‌ చేస్తున్నారు అనే విషయాలను ముఠా సభ్యులను ఎంక్వయిరీ చేసి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.