Begin typing your search above and press return to search.

బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినోళ్లు ఎంతమంది?

By:  Tupaki Desk   |   22 Dec 2020 7:30 AM GMT
బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినోళ్లు ఎంతమంది?
X
ప్రపంచానికి కనిపించని శత్రువు. మైక్రో స్కోప్ లో చూసినా.. చాలా చిన్నగా కనిపించే ఒక వైరస్.. మానవాళిని గజగజలాడిపోయేలా చేయటమే కాదు వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. 2020 సంవత్సరానికి తగ్గట్లే.. ప్రపంచ ప్రజలకు ఈ మాయదారి సంవత్సరం.. రెండు పెద్ద గుండుసున్నాల్ని మిగిల్చింది. ఏడాది చివరకు వచ్చిన వ్యాక్సిన్ కారణంగా.. మహమ్మారి నీడ నుంచి బయటపడొచ్చన్న ఆశ.. ఇప్పుడు అత్యాశగా మారింది. బ్రిటన్ లో కరోనా వైరస్ రూపు మార్చుకోవటమే కాదు.. గతానికి కంటే భిన్నంగా చాలా జోరుగా వ్యాపిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

రోజుల వ్యవధిలో బ్రిటన్ లోని పరిస్థితులు మారిపోవటమే కాదు.. ప్రపంచ దేశాల్లోని పలు దేశాలు బ్రిటన్ తో రాకపోకల్ని కట్ చేసేసుకుంటున్నాయి. ఇప్పుడా జాబితాలో భారత్ కూడా చేరింది. ఇదంతా ఓకే.. మరి.. గడిచిన వారం.. పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఉంటారు? అన్నది ప్రశ్న. మరింత సూక్ష్మంగా వెళితే.. తెలుగు రాష్ట్రాలకు వచ్చే వారు ఎవరైనా సరే.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకే ఎక్కువగా ల్యాండ్ అయ్యే వీలుందని చెబుతున్నారు.

బ్రిటన్ తో పాటు.. ఆ దేశం నుంచి మిగిలిన యూరోపియన్ దేశాలకు వెళ్లి.. అనంతరం భారత్ కు వచ్చే బ్యాచ్ కూడా తక్కువేం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశంలోని ప్రధాన నగరాలైన.. ముంబయి.. ఢిల్లీ.. బెంగళూరు.. చెన్నై లాంటి నగరాలకు చేరుకొని.. అక్కడి రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చినోళ్లు ఎంతమంది ఉంటారు? అన్నదిప్పుడు ప్రశ్న. అధికారుల లెక్కల ప్రకారం చూస్తే.. గడిచిన వారం.. పది రోజుల్లో తక్కువలో తక్కువ పదివేల మంది వరకు వచ్చి ఉంటారని చెబుతున్నారు.

మరి.. వీరు ఎక్కడికి వెళ్లారు? ఇప్పుడెలా ఉన్నారు. వచ్చినోళ్లలో ఇద్దరు.. ముగ్గురికి కానీ ఈ కొత్త స్టెయిన్ కానీ అంటుకొని ఉంటే చాలు..వ్యాపించకుండా నిరోధించటం చాలా కష్టమంటున్నారు. అందులోని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందంటున్నారు. మొత్తంగా.. పరిస్థితి ఫర్లేదు.. అదుపులోకి వస్తుందని మొదట్లో అనుకున్న వేళ.. మర్కజ్ పేరుతో రచ్చ రచ్చ అయితే.. ఇప్పుడు బ్రిటన్ దెబ్బకు జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఏమైనా.. మర్కజ్ ఎపిసోడ్ మాదిరి బ్రిటన్ నుంచి వచ్చిన వారిని ఎంత త్వరగా గుర్తించి.. యుద్ధ ప్రాతిపదికన సెట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.