Begin typing your search above and press return to search.
కరోనా వ్యాక్సినేషన్ కు లేటవుతుందా ?
By: Tupaki Desk | 27 Jan 2021 8:30 AM GMTపంచాయితి ఎన్నికల నిర్వహణ కారణంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో బాగా ఆలస్యమయ్యేట్లుంది. దేశం మొత్తానికి మొన్నటి 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రోగ్రామ్ మొదలైనప్పటి నుండి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా జోరుగా జరుగుతోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ లోనే మొదటి విడదతగా 7 లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మొదలైంది. వీరిలో ఆశా వర్కర్లు, హెల్త్ డిపార్టమెంటు ఉద్యోగులు, మున్సిపల్, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులున్నారు.
ఇక రెండో విడతలో 73,188 మంది పోలీసులున్నారు. మొదటి విడత జరుగుతుండగానే హఠాత్తుగా పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఒకవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చేసిన వాదనను సుప్రింకోర్టు తోసిపుచ్చింది. దాంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏమి చేయాలో చెప్పమంటూ చీఫ్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 1.35 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలోను కనీసం 5 మంది సిబ్బంది అవసరం. అంటే సుమారు 6 లక్షల మంది సిబ్బంది ఎన్నికల డ్యూటీలో ఉండాల్సుంటుంది. ఎన్నికల డ్యూటీ అన్నాక వీళ్ళందరినీ ఎక్కడెక్కడో వేసేస్తారు. కాబట్టి వీళ్ళకు వ్యాక్సినేషన్ సాధ్యంకాదు. పైగా ఇఫుడు వ్యాక్సినేషన్ చేస్తున్న వాళ్ళు కూడా వీరిలోనే ఉన్నారు. కాబట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలగక తప్పదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి విడత డోసు వేసుకున్నవారు కూడా ఇపుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. రెండు డోసులకు మధ్య 28 రోజుల వ్యవధి ఉండాలి. ఎన్నికల డ్యూటీ కారణంగా సుమారు 10 వేలమందికి రెండో డోసు వేయటం వీల్లదవ్వదేమో అని ఉన్నతాధికారులు ఆందోళన మొదలైంది. మరి మొదటి డోసు వేసుకుని రెండో డోసు సమయానికి వేసుకోకపోతే వాళ్ళ పరిస్ధితి ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరి ఈ ప్రశ్నలకు కేంద్రం ఏమని సమాధానం ఇస్తుందో చూడాల్సిందే.