Begin typing your search above and press return to search.

కరోనాతో శవాల దిబ్బ.. ఏం పాపం చేసుకున్నదో ఆ దేశం..!

By:  Tupaki Desk   |   15 April 2021 6:30 AM GMT
కరోనాతో శవాల దిబ్బ.. ఏం పాపం చేసుకున్నదో ఆ దేశం..!
X
బ్రెజిల్​ ఓ అభివృద్ధి చెందిన దేశం. అక్కడి ప్రజలు కూడా ఎంతో నాగరికులు. అయితే కరోనా సృష్టించిన విలయం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఒకప్పుడు వెలుగులీనిన ఆ దేశం ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. కరోనాకు ప్రపంచం మొత్తం విలవిలలాడిన మాట వాస్తవమే కావొచ్చు.. కానీ బ్రెజిల్​ పరిస్థితి మరింత దారుణం. అక్కడ మరణాల రేటు ఎక్కువ. పూడ్చిపెట్టడానికి ప్రదేశాలు.. శవాలు తీసుకెళ్లడానికి మనుషులు లేని దుస్థితి. ఓ దశలో అక్కడ సామూహిక అంత్యక్రియలు నిర్వహించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కరోనాతో చనిపోతే అయినవాళ్లు కూడా దగ్గరకు రాలేని పరిస్థితి దీంతో ఆ దేశం ఎంతో దీనంగా మారింది. అయితే గత కొన్ని నెలలుగా ఆ దేశంలో జననాల సంఖ్య కంటే.. కరోనా మరణాల సంఖ్యే ఎక్కువగా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దేశంలోని కొన్ని నగరాల్లో పరిస్థితి మరీ దయనీయం ఉంది. రియో డి జనిరో అనే నగరంలో చాలా రోజులకుగా జననాల కంటే మరణాల సంఖ్యే ఎక్కవగా ఉంది. రియోలో మార్చిలో 36వేల 437 మంది చనిపోయారు. ఆ న‌గ‌రంలో ఆ నెల‌లో పుట్టిన వారి సంఖ్య 32వేల 60గా ఉంది. అంటే ఒక నెల‌లో జ‌న‌నాల క‌న్నా మ‌ర‌ణాల సంఖ్య 16 శాతం ఎక్కువ‌గా ఉంది. జాతీయ సివిల్ రిజిస్ట‌ర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఒక్క రియో న‌గ‌ర‌మే కాదు.. ఆ దేశంలో మ‌రో ప‌ది న‌గ‌రాల్లోనూ ఇదే త‌ర‌హా దుస్థితి. 5 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ జ‌నాభా ఉన్న న‌గ‌రాల్లో త‌క్కువ సంఖ్య‌లోనే జ‌న‌నాలు న‌మోదు అవుతున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. పీ 1 వేరియంట్ అనే కొత్త రకం వైరస్​ అక్కడ విలయం సృష్టించింది. జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ ప్ర‌కారం బ్రెజిల్‌ లో ఇప్ప‌టి వ‌ర‌కు 77వేల 515 మంది కోవిడ్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. 20 ల‌క్ష‌ల మందికి కరోనా సోకింది. బ్రెజిల్​లోని మొత్తం 27 రాష్ట్రాల్లో పరిస్థితి దయనీయంగానే ఉంది. అక్కడి చాలా ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. అయితే ఈ పరిస్థితికి కారణం కొత్త స్ట్రెయిన్​ యేనని సైంటిస్టులు అంటున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని మరణాలు బ్రెజిల్​ లో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.