Begin typing your search above and press return to search.

క‌రోనా పాజిటివా.. నో ఎంట్రీ: `బెంగ‌ళూరు` నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   25 March 2021 3:32 PM GMT
క‌రోనా పాజిటివా.. నో ఎంట్రీ: `బెంగ‌ళూరు` నిర్ణ‌యం
X
దేశంలో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌వ‌ర‌పెడుతోంది.  కేసులు పెరుగుతున్నాయి. సాధార‌ణ ప్ర‌జ‌లను తీవ్రంగా భయపె డుతున్నాయి. తాజాగా దేశంలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 47,262 కేసులు నమోదయ్యాయి. గడచిన 132 రోజులుగా నమోదవుతున్న కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో.. దేశంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 1,17,34,058కి చేరుకుంది. వరుసగా 14వ రోజూ రికవరీల కన్నా కొత్త కేసులే అధికంగా నమోదయ్యాయి. దీంతో.. యాక్టివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,68,457కి పెరిగింది. ఇది మొత్తం కేసుల్లో 3.14 శాతం కావడం గమనార్హం.

అదేవిధంగా దేశంలో రోజువారీ కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంట‌ల‌వ్య‌వ‌ధిలో రికార్డు స్థాయిలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 275 నమోదయ్యాయి. గడచిన 83 రోజుల్లో సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,60,441కి చేరింది. ఇక‌క‌, క‌రోనా రెండో ద‌శ‌లో... తొలి వీఐపీ  కేసుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్ నిలిచారు. ఆయ‌న‌ కరోనా బారిన పడ్డారు. గ‌తంలో తొలిద‌శలో చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నివారణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కర్ణాటక వెలుపల ఉన్నవారు ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర రాజధాని బెంగళూరులోకి ప్రవేశించడానికి కరోనా వైరస్ పరీక్ష నెగిటివ్ నివేదికను తప్పని సరిగా తీసుకొని రావాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ కె. సుధాకర్ స్పష్టం చేశారు. బెంగళూరు సిటీలో 24 గంట‌ల్లో 1,400 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రంలో అధికంగా కరోనా కేసులు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా నిర్ణ‌యంతో ఐటీ రాజ‌ధాని బెంగ‌ళూరు ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. ఎవ‌రు రావాల‌న్నా.. ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నా కూడా.. ఖ‌చ్చితంగా క‌రోనా రిపోర్టు అవ‌స‌రం ఉంది.