Begin typing your search above and press return to search.

ఏపీకి వచ్చే టీకాలపై క్లారిటీ.. ఏ కంపెనీవి ఎన్ని వస్తున్నాయంటే?

By:  Tupaki Desk   |   12 Jan 2021 4:04 AM GMT
ఏపీకి వచ్చే టీకాలపై క్లారిటీ.. ఏ కంపెనీవి ఎన్ని వస్తున్నాయంటే?
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఎట్టకేలకు ఏపీకి వచ్చేస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఎన్ని టీకాల్ని తొలి దశలో పంపాలన్న విషయంపై కేంద్రం లెక్క కట్టింది. ఇందులో భాగంగా ఏపీకి ఐదు లక్షల డోసుల్ని టాకాల రూపంలో ఇవ్వనున్నారు. తొలివిడత కింద వచ్చే ఐదు లక్షల డోసుల్లో తొలుత ఆరోగ్య కార్యకర్తలు.. సిబ్బందికి ఇవ్వనున్నారు. ఇక.. ఏపీకి వచ్చే వ్యాక్సిన్ లో ఏ కంపెనీవి రానున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది.

ఏపీకి వచ్చే ఐదు లక్షల టీకాల్లో నాలుగు లక్షల టీకాలు ఫూణెకు చెందిన సీరం కంపెనీకి చెందిన కోవిషీల్డ్ టీకాలు కాగా.. లక్ష మాత్రం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ సిద్ధం చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు. రెండు టీకా డోసుల్ని సంబంధిత జిల్లాలకు పంపనున్నారు. తొలి విడతలో వచ్చే డోసుల్లో 3.82లక్షల డోసులు.. ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్నారు. ఇందుకోసం 1940 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని అర్హులందరికి టీకాలు వేయాలంటే 40, 410 కేంద్రాలుఅవుసరమవుతాయని లెక్క కట్టారు. అంతేకాదు.. వ్యాక్సిన్ వేసేందుకు 17,775 మంది వ్యాక్సినేటర్లను సిద్ధం చేశారు. మొదటి విడత టీకా తీసుకున్న కంపెనీదే.. రెండో దఫాలోనూ వేసుకోవాల్సి ఉంటుంది.