Begin typing your search above and press return to search.

మహమ్మారిపై బైడెన్ యుద్ధం.. చేతికి బ్యాండ్లు.. ముఖానికి మాస్కులు

By:  Tupaki Desk   |   23 Jan 2021 9:32 AM GMT
మహమ్మారిపై బైడెన్ యుద్ధం.. చేతికి బ్యాండ్లు.. ముఖానికి మాస్కులు
X
అమెరికా చరిత్రలో మరెప్పుడూ చోటు చేసుకోని రీతిలో ఒక ఉదంతంలో అమెరికన్లు పెద్ద ఎత్తున ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతం ఏమైనా ఉందంటే.. అది కరోనా ఎపిసోడ్ అని చెప్పాలి. ప్రపంచంలో మరే దేశంలో లేనంత ఎక్కువగా కరోనా మరణాలు అగ్రరాజ్యమైన అమెరికాలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 4 లక్షల మంది కరోనా కారణంగా మరణించారు. ఫిబ్రవరి చివరి నాటికి మరణాల సంఖ్య ఐదు లక్షల్ని దాటుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటివేళ.. బైడెన్ కొత్త విధానాల్ని ప్రకటించారు.ట్రంప్ మాదిరి కాకుండా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ.. కరోనా నిబంధనల్ని తెర మీదకు తీసుకొచ్చారు. వంద రోజుల పాటు సాగే ఈ యుద్దంలో.. విధివిధానాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. చేతికి రిస్ట్ బ్యాండ్ లు.. ముఖానికి మాస్కులు తప్పనిససరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్యాండ్ లో ఉండే ట్రాకర్ సాయంతో కోవిడ్ రోగుల్ని గుర్తించేలా ఏర్పాట్లు ఉన్నాయి.

బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం తప్పనిసరి చేశారు. ఉద్యోగుల సీట్లను అరడుగుల దూరంలో ఏర్పాటు చేశారు. కరోనాపై పోరాటమే తన ప్రథమ ప్రాధన్యతా అంశంపై బైడెన్ పేర్కొనటం తెలిసిందే. కరోనాతో మరణించిన వారి సంఖ్య నాలుగు లక్షల్ని దాటేసిందని.. రెండో ప్రపంచ యుద్ధ మృతుల కంటే ఇది ఎక్కువని.. వచ్చే నెలాఖరుకు ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంటుందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు.

కరోనాను కట్టడి చేసేందుకు బైడెన్ రూపొందించిన వ్యూహంలో.. అమెరికన్లు అందరూ వంద రోజులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినా.. షాపింగ్ కోసం బయటకు వెళ్లినా.. భౌతిక దూరం తప్పనిసరి. వైట్ హౌస్ కు వచ్చే వారంతా చేతికి కరోనా ట్రాకర్ బ్యాండ్ ధరించాల్సి ఉంటుంది. అమెరికాకు వచ్చే ప్రతి ఒక్కరూ కరోనా పరీక్ష చేసుకున్న తర్వాతే విమానం ఎక్కాల్సి ఉంటుంది. అమెరికాలో దిగాక హోం క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. బైడెన్ అమల్లో్కి తెచ్చిన కొత్త ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.