Begin typing your search above and press return to search.

హెచ్చ‌రికః అవుపేడ‌తో డేంజ‌ర్!

By:  Tupaki Desk   |   12 May 2021 2:34 AM GMT
హెచ్చ‌రికః అవుపేడ‌తో డేంజ‌ర్!
X
జ‌నాలు మూఢ‌త్వంలో ఎలా కొట్టుకుపోతారో చెప్ప‌డానికి నిత్యం ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపిస్తూనే ఉంటాయి. అయితే.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఇంకా విచిత్ర‌మైన ప‌నులు చేస్తున్నారు చాలా మంది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే పుకార్ల‌ను న‌మ్మేస్తూ.. వాళ్ల‌కు వాళ్లే వైద్యులుగా మారిపోతున్నారు. సొంత వైద్యం చేసుకుంటున్నారు. అలాంటి వైద్యంలో ఒక‌టి ఆవుపేడ‌, మూత్రం.

గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన చాలా మంది జ‌నం ఈ ప్ర‌యోగం చేసుకుంటున్నారు. దీని ప్ర‌కారం.. ఆవుపేడ‌, మూత్రం క‌లిపి చిక్క‌గా ఒంటికి రాసుకొని, ఆ త‌ర్వాత ఎండ‌లో నిల‌బ‌డుతున్నార‌ట‌. అది మొత్తం ఆరిపోయిన త‌ర్వాత పాలు, మ‌జ్జిగ‌తో క‌డిగేసుకుంటున్నార‌ట‌. ఈ విధంగా.. వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంద‌ట‌. మ‌న ద‌గ్గ‌ర మౌత్ పబ్లిసిటీకి కొద‌వేముందీ? ఈ విష‌యం ఈ నోటా.. ఆ నోటా పాకి గుజ‌రాత్ లో చాలా మంది ఇలా చేస్తున్నార‌ట‌.

ఈ మూఢ‌త్వం ఇంకెలాంటి ప‌రిస్థితికి దారితీస్తుందోన‌ని ఆందోళ‌న చెందిన వైద్యులు స్పందించారు. ఇలా చేయ‌డం మంచిది కాద‌ని చెబుతున్నారు. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా.. ఇలాంటి ప‌నుల వ‌ల్ల ఇత‌ర వ్యాధులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి, డాక్ట‌ర్ల స‌ల‌హాను ఎంత మంది వింటారో..?