కరోనా మహమ్మారి ఇప్పుడు సాధారణ దగ్గు, జ్వరంలా మారిపోయింది. మన చుట్టూ ఉన్నవాళ్లలో చాలామందికి కరోనా వచ్చి తగ్గిపోతోంది. దీంతో ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ పై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. వాటి కేసులో పెద్దమొత్తంలో నమోదైతే మళ్లీ పరిస్థితి మొదటికి రావచ్చు. అయితే పాత కరోనా గురించి మాత్రం ప్రజల్లో పెద్దగా భయం లేదు.
కానీ కరోనా వచ్చి తగ్గాకకూడా చాలామందికి అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. కొంతమందిలో కరోనా నెగిటివ్ వచ్చాక కూడా అనారోగ్యం బాధిస్తున్నది. అయితే కరోనా రోగులకు ప్రస్తుతం వెక్కిళ్లు వస్తున్నాయట. అది కూడా చాలాసేపటివరకు తగ్గట్లేదట. మరోవైపు కరోనా వచ్చి తగ్గిపోయాక కూడా తీవ్రమైన కంటిసమస్యలు వేధిస్తున్నాయట. వీటికితోడు పంటి సమస్యలు వస్తున్నాయట. కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొంతమందిలో ఎలాంటి నొప్పి లేదా రక్తస్రావం లేకుండానే పళ్లు ఊడిపోతున్నాయని వైద్యులు గుర్తించారు.
అయితే కరోనా వైరస్ కంటికి కూడా సోకుతుందని గతంలోనే వైద్యులు గుర్తించారు. అయితే ఈ సమస్య అందరిలో కనిపించలేదు. కేవలం కొందరిలో మాత్రమే ఇటువంటి కంటిసమస్యలు కనిపించాయి. అయితే కరోనా వచ్చిపోయాక కంటి సంబంధిత సమస్యలు వస్తే అలసత్వం వహించొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఓ వైపు కొత్త కరోనా ముప్పు ముంచుకురావడం.. మరోవైపు పాత కరోనాతో మరికొన్ని కొత్త లక్షణాలు బయటపడుతుండటంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.